English | Telugu

లవర్ పేరు చెప్పిన సీతా రామం హీరోయిన్ మృణాళిని

భారతీయ చిత్ర పరిశ్రమలో తాము నటించిన మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్లు అయిపోయిన నటీమణులు చాలా తక్కువ మందే ఉంటారు. ఎందుకంటే తాము నటించిన సినిమాలో తన అందం తో పాటు నటనకి అవకాశం ఉన్న పాత్ర దొరికినప్పుడే అలా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోవడమే కాకుండా ప్రేక్షకుల గుండెల్లో తన రూపం చెరిగిపోని విధంగా గుర్తుండేలా చేసుకుంటుంది. అలా ఒకే సినిమాతో తెలుగు ప్రేక్షుకుల గుండెల్లో గుర్తుండిపోయిన నటి మృణాళిని ఠాకూర్ ఇప్పుడు ఈ భామ తన లవర్ గురించి చెప్పి తన అభిమానులని షాక్ కి గురి చేసింది.
గత సంవత్సరం వచ్చిన సీతారామం సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైన మృణాళిని ఆ సినిమా ద్వారా లక్షల మంది అభిమానులని సంపాదించుకుంది. ఆ మూవీ లో తను ప్రదర్శించిన నటనకి అలాగే తన అందానికి తెలుగు ప్రేక్షకులు ధాసోహమయిపోయారు. సీత పాత్రలో మృణాళిని చాలా అద్భుతంగా నటించింది. ఉత్తరాదికి చెందిన ఈ భామ ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో రాబోయే రోజుల్లో ఫుల్ బిజీ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రస్తుతం తను నాచురల్ స్టార్ నాని తో ఒక మూవీ చేస్తుంది. ఆ మూవీ షూటింగ్ కూడా జరుపుకుంటుంది. మెగాస్టార్ అప్ కింగ్ మూవీలో కూడా మృణాళిని హీరోయిన్ గా చేస్తుందనే టాక్ వినబడుతుంది. అదే జరిగితే మృణాళిని టాప్ హీరోయిన్ అవ్వడం ఖాయం.
ఆ విషయాలన్నీ అలా ఉంచితే మృణాళిని తాజాగా ఒక ఇంటర్వ్యూ లో నేను ప్రముఖ హాలీవుడ్ హీరో కీని రీవ్స్ ని లవ్ చేసానని చిన్నపడే ఒక సినిమాలో చూసి కీని లవ్ చేసానని కానీ అది వన్ సైడ్ లవ్ గానే మిగిలిపోయిందని చెప్పుకొచ్చింది. దీంతో ఆమె అభిమానులు కొంత రిలీఫ్ ఫీల్ అయ్యారు. ఎందుకంటే అసలికేమృణాళిని ని తమ హృదయ దేవతగా కొలిచే అభిమానులు మృణాళిని కనుక తనకి ఇప్పుడు లవర్ ఉన్నాడని చెప్పి ఆ లవర్ ని మీడియా ముందుకు తిసుకోచ్చిందంటే మాత్రం ఆమె అభిమానులు తట్టుకోలేరు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.