English | Telugu

'మోసగాళ్ళకు మోసగాడు ' ట్వీట్ రివ్యూ

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బావ సుదీర్ బాబు నటించిన ''మోసగాళ్ళకు మోసగాడు '' ఈరోజు రిలీజైంది. సుదీర్ బాబు ఇప్పటివరకు చెప్పుకోతగ్గ హిట్ ఒక్కటీ కొట్టలేదు .'' ప్రేమకథా చిత్రమ్ '' మంచి హిట్ అయినప్పటికీ ఆ క్రెడిట్ సుదీర్ కు దక్కలేదు . దీంతో ఈ సినిమా సక్సెస్ సుదీర్ బాబుకి ఎంతో ముఖ్యం. మరి మోసగాడిగా సుదీర్ బాబు సక్సెస్ అవతాడో లేదా అనేది మరీ కొద్ది సేపట్లో తెలియనుంది. ఈ సినిమా ఫస్ట్ షో లైవ్ అప్ డేట్స్ మీ కోసం తీసుకువచ్చింది తెలుగువన్.

''మోసగాళ్ళకు మోసగాడు '' మూవీ మొదలైంది. ఓ భారీ దొంగతనం జరుగుతోంది. దొంగతనాన్ని చాలా స్టైలిష్‌ పిక్చరైజేషన్ చేశారు.

హీరో సుధీర్ బాబు ఎంట్రీ ఇచ్చాడు. సినిమాలో మొదటి పాట మొదలైంది. సాంగ్ చాలా స్టైలిష్‌ గా తీశారు.

ఇప్పుడు హీరోయిన్ నందిని రాయ్ ఎంట్రీ ఇచ్చింది. కమెడియన్ ప్రదీప్, చంద్రమోహన్ లు కూడా ఎంట్రీ ఇచ్చారు.

సుధీర్ బాబు, జయప్రకాశ్ రెడ్డిల మధ్య కామెడీ సీన్స్ వస్తున్నాయి.

రెండో పాటకు టైం అయ్యింది. 'ఓహో జానకి' సెకండ్ సాంగ్ మొదలైంది.

సినిమా ఇంట్రస్టింగ్ మోడ్ లోకి వెళుతోంది. భారీ చేజింగ్ సన్నివేశాలు నడుస్తున్నాయి.

జయప్రకాశ్ రెడ్డి తో వచ్చే సన్నివేశాలన్నీ కామెడీగా చిత్రీకరించినట్టున్నారు. జయప్రకాష్ రెడ్డి, ఫిష్ వెంకట్‌ల మధ్యన కామెడీ సన్నివేశాలు బాగున్నాయి.

సినిమా ఆసక్తికర ట్విస్ట్. సినిమా విరామం దిశగా వెళుతోంది.

ఆసక్తికరమైన మలుపుతో సినిమాకు ఇంటర్వెల్ ఇచ్చారు.

విరామం తరువాత 'మోసగాళ్ళకు మోసగాడు' మళ్ళీ మొదలైంది. జయప్రకాష్ రెడ్డి, దువ్వాసి మోహన్ మధ్య కామెడీ సీన్స్ వస్తున్నాయి.


సినిమా మరింత ఆసక్తికర౦గా ముందుకు సాగుతోంది. మరిన్ని ఇంటెరెస్టింగ్ సీన్ వస్తున్నాయి.

ఇప్పటివరకు నవ్వించిన జయప్రకాష్ రెడ్డి..సిరీయస్ మోడ్ లోకి వచ్చారు. హీరో, ఆయన మధ్య ఆసక్తికర సన్నివేశాలు నడుస్తున్నాయి.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.