English | Telugu

మోహన్ బాబు సంచలన నిర్ణయం..మీడియాని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు

తన కుటుంబానికి చెందిన పర్సనల్ విషయాల్లో మీడియా ఎంటర్ అయినందుకు మోహన్ బాబు(mohan babu)ఒక మీడియా పర్సన్ పై దాడి చేసి గాయపరిచిన విషయం తెలిసిందే.దీంతో ఈ సంఘటనపై మీడియా సంఘాలు మోహన్ బాబుపై పలు చోట్ల పోలీసు కేసు నమోదు చేయించడంతో పాటు క్షమాపణలు చెప్పాలని కూడా కోరడం జరిగింది.

దీంతో రీసెంట్ గా మోహన్ బాబు బహిరంగంగా ఒక లేఖని విడుదల చేస్తూ 'నా కుటుంబ ఘటన పెద్దదిగా మారడం వల్ల ఆవేశంతో జర్నలిస్ట్ ని గాయపరిచిందనుకు చింతిస్తున్నాను.ఘటన అనతరం నలభై ఎనిమిది గంటలపాటు ఆసుపత్రిలో ఉండటం వల్ల జర్నలిస్ట్ విషయంలో నేను స్పందించలేకపోయాను.నా వల్ల కలిగిన ఇబ్బంది వల్ల జర్నలిస్ట్ కుటుంబానికి, టీవీ9 ఫ్యామిలీకి మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను.

నేను నా ఫ్యామిలీ లో ఏర్పడిన పర్సనల్ విబేధాల వలన చాలా ఆందోళనలో ఉన్నాను.కొంత మంది నా ఫ్యామిలీ ని టార్గెట్ చేసారు. ఆ టైం లో నా గేట్లు బద్దలు కొట్టుకొని ముప్పై నలభై మంది అసాంఘిక శక్తులు వచ్చారు. వాళ్ళని నియంత్రించే పనిలోనే భాగంగానే  అనుకోకుండా దాడి జరిగిందని చెప్పుకొచ్చాడు.