English | Telugu
రొమాంటిక్ థ్రిల్లర్ ‘వారధి’ సెన్సార్ పూర్తి - త్వరలో విడుదల!
Updated : Dec 12, 2024
తెలుగు ప్రేక్షకుల కోసం మరో యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ‘వారధి’ రాబోతోంది. అనిల్ ఆర్కా, విహారికా చౌదరి జంటగా శ్రీకృష్ణ దర్శకత్వంలో రాధాకృష్ణ ఆర్ట్స్ బేనర్‌పై పెయ్యాల భారతి, ఎం.డి.యూనస్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సినిమాకి యు/ఎ సర్టిఫికెట్‌ను ఇచ్చిన సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్‌ను అభినందించారు.
ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకృష్ణ మాట్లాడుతూ ‘ఈ కథలో లవ్, రొమాన్స్, థ్రిల్లింగ్ అంశాలు ఉండడంతో తప్పకుండా అందర్నీ ఆకట్టుకుంటుందన్న నమ్మకం మాకు ఉంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం’ అన్నారు. ఈ సినిమాకు సాంకేతిక నిపుణుల కృషి, కథా కథనాల ప్రత్యేకత, నటీనటుల అభినయం ప్రధాన బలంగా నిలుస్తాయని చిత్ర యూనిట్ పేర్కొంది. ‘వారధి’లో ప్రేమ, భావోద్వేగాలు, సస్పెన్స్ అంశాలను కలిపి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే ప్రయత్నం చేశారు.