English | Telugu

నన్నుచెట్టుకి కట్టేసి కొట్టారంటున్న మోహన్ బాబు కారు డ్రైవర్ 

మోహన్ బాబు(Mohan babu)మనోజ్(manoj)మధ్య గత నాలుగైదు రోజులుగా జరుగుతున్న గొడవ ఇప్పుడిప్పుడే  సద్దుమణుగుతుంధి.ఎలాంటి గొడవలు జరగవని ఆ ఇద్దరు పోలీసులకి హామీని కూడా ఇచ్చారు.ఇక ఈ గొడవల్లో మోహన్ బాబు ఆవేశంతో ఒక జర్నలిస్ట్ పై దాడి చేసి గాయపరిచిన ఘటనలో మోహన్ బాబు సదరు జర్నలిస్ట్ కి క్షమాపణలు చెప్పడం కూడా జరిగింది.

ఇప్పుడు రీసెంట్ గా మోహన్ బాబు దగ్గర ఐదు సంవత్సరాల నుంచి డ్రైవర్ గా పని చేస్తున్నా వ్యక్తి మీడియా ముఖంగా మాట్లాడుతూ మోహన్ బాబు చిన్న కొడుకు మనోజ్ ఏడు రోజుల క్రితం నన్ను చెట్టుకి కట్టేసి చాలా దారుణంగా  కొట్టాడు.మా ఇంట్లో ఆడవాళ్ళని ఉద్దేశించి భూతులు కూడా తిట్టాడు.ఎవరకి చెప్పుకుంటావో చెప్పుకో అవసరమైతే నిన్ను చంపేస్తానని కూడా బెదిరించాడు.ఇన్ని రోజులు భయంతో ఈ విషయం ఎవరకి చెప్పలేదని చెప్తు తనకి తగిలిన గాయాలతో పాటు హాస్పిటల్ లో జాయిన్ అయిన బిల్లు ని కూడా చూపిస్తున్నాడు.దీంతో ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారగా మనోజ్ ఈ విషయం మీద ఏ విధంగా స్పందిస్తాడో  చూడాలి.