English | Telugu

మిరాయ్ ఫస్ట్ డే కలెక్షన్స్.. హనుమాన్ రికార్డు అవుట్!

ప్రస్తుతం 'మిరాయ్' సినిమా పేరు మారుమోగిపోతోంది. 'హనుమాన్' వంటి పాన్ ఇండియా సక్సెస్ తర్వాత తేజ సజ్జా నటించిన ఈ మూవీ.. మంచి అంచనాలతో నేడు(సెప్టెంబర్ 12) థియేటర్లలో అడుగుపెట్టి, పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా చూడటానికి ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే.. 'మిరాయ్' మూవీ 'హనుమాన్'ని మించిన ఓపెనింగ్స్ రాబట్టినా ఆశ్చర్యంలేదు అనిపిస్తోంది. (Mirai Movie)

అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా వరల్డ్ వైడ్ గా రూ.6 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన మిరాయ్.. పాజిటివ్ టాక్ రావడంతో బుకింగ్స్ లో మరింత జోష్ చూపిస్తోంది. బుక్ మై షోలో గంటకు 20 వేలకు పైగా టికెట్స్ బుక్ అవుతున్నాయంటే.. ఫస్ట్ డేనే ఆడియన్స్ నుంచి ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో అర్థం చేసుకోవచ్చు. ప్రజెంట్ ట్రెండ్ ని బట్టి చూస్తే.. తెలుగు రాష్ట్రాల్లోనే మొదటిరోజు రూ.10 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి మరో రూ.10 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టడం ఖాయమని చెబుతున్నారు. అంటే ఈ మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.20 కోట్లకు పైగా గ్రాస్ సాధించనుంది అన్నమాట.

'హనుమాన్' మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ.24 కోట్ల గ్రాస్ తో సత్తా చాటింది. 'మిరాయ్' బుకింగ్స్ చూస్తుంటే.. 'హనుమాన్'ని మించేలా రూ.25 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం లేకపోలేదు.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.