English | Telugu

రేపు మెగా ఫ్యాన్స్ కి పండగే!

మెగాస్టార్ చిరంజీవి తన 156వ సినిమాని 'బింబిసార' ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంట‌సీ ఫిల్మ్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ వచ్చింది.

'మెగా 156' టైటిల్ ను రేపు(జనవరి 15న) సాయంత్రం 5 గంటలకు రివీల్ చేయనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకి 'విశ్వంభర' అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. మరి మూవీ టైటిల్ 'విశ్వంభర'నా? లేక మరేదైనా టైటిలా? అనేది రేపటితో తేలిపోనుంది.

ఈ సినిమాని 2025 సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.