English | Telugu

ఫ్లాప్ మూవీ సీక్వెల్ లో మెగా హీరో!

- టాలీవుడ్ లో కొత్త ట్రెండ్
- ఫ్లాప్ సినిమాకి సీక్వెల్
- సాహసం చేస్తున్న మెగా హీరో

ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. అయితే హిట్ సినిమాలకు సీక్వెల్స్ రావడం సహజమే. కానీ, ఒక ఫ్లాప్ సినిమాకి సీక్వెల్ చేయడానికి ప్రస్తుతం టాలీవుడ్ లో సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సాహసం చేస్తుందని మెగా హీరో కావడం విశేషం.

టాలీవుడ్ లోని టాలెంటెడ్ డైరెక్టర్స్ లో దేవ కట్టా ఒకరు. వెన్నెల, ప్రస్థానం వంటి సినిమాలతో తన ప్రతిభను చాటుకున్నారు. అయినప్పటికీ, నాలుగైదు ఏళ్లకు ఒక సినిమా అన్నట్టుగా ఆయన కెరీర్ సాగుతోంది. చివరిసారి 2021లో వచ్చిన 'రిపబ్లిక్' సినిమాతో ప్రేక్షకులను పలకరించారు దేవ కట్టా. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ పొలిటికల్ డ్రామా.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది కానీ, బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలైంది.

'రిపబ్లిక్' మూవీ రిజల్ట్ తో సంబంధం లేకుండా.. దేవ కట్టాతో మరోసారి కలిసి పని చేయడానికి సాయి తేజ్ రెడీ అయినట్లు తెలుస్తోంది. అది కూడా 'రిపబ్లిక్' సీక్వెల్ అని సమాచారం. సాయి ధరమ్ తేజ్, దేవ కట్టా మధ్య ఇప్పటికే కథా చర్చలు జరిగాయని.. ప్రస్తుతం సాయి తేజ్ చేతిలో ఉన్న 'సంబరాల ఏటిగట్టు' పూర్తయిన తర్వాత, ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో న్యూస్ వినిపిస్తోంది.

Also Read: 'బాహుబలి ది ఎపిక్' యూఎస్ రివ్యూ..!

బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉన్నా.. 'రిపబ్లిక్' సినిమాని అభిమానించేవారు బాగానే ఉన్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికీ ఆ సినిమాపై ప్రశంసలు కురుస్తూనే ఉంటాయి. పైగా, ఇటీవల 'మయసభ' అనే పొలిటికల్ సిరీస్ తో దేవ కట్టా ఆకట్టుకున్నారు. అందుకే 'రిపబ్లిక్' సీక్వెల్ తో సాహసం చేయడానికి సాయి ధరమ్ తేజ్ సిద్ధమయ్యారని వినికిడి. చూద్దాం మరి ఈ సీక్వెల్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.