English | Telugu

నటి మీరా చోప్రా అరెస్ట్

నటి మీరా చోప్రా అరెస్ట్ అయ్యింది. అది కూడా ఒక భర్తతో అతని భార్య చావుకి ఈ మీరా చోప్రా కారణమయ్యిందన్న ఆరోపణ మీద. వివరాల్లోకి వెళితే గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, భరణి దర్శకత్వంలో వచ్చిన "బంగారం" చిత్రంలో నటించి తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించింది. ఈ మీరా చోప్రా. ఢిల్లీకి చెందిన రుచి భూటాన్ అనే ఆమెను ఆమె భర్తతో హత్య చేయించిందన్న కారణంగా ఐపిసి 120 బి సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను వెతికి మరీ పట్టుకున్నారు. ఢిల్లీ కి చెందిన రుచి భూటాన్ భర్త సుమిత్ భూటాన్ తో మీరా చోప్రాకు వివాహేతర సంబంధం ఉందట.

ఇంట్లో తన భార్యతో "మీరా అయితే ఇలా చేస్తుంది...మీరా అయితే అలా చేస్తుంది...మీరా అయితే అందంగా నవ్వుతుంది...నాతో ప్రేమగా ఉంటుంది...నీ మొఖం చూస్తే నాకు చిరాకు కలుగుతుంది" అంటూ తరచూ ఆమెను కించపరిచే విధంగా భర్త సుమిత్ భూటాన్ అంటూ ఉండేవాడట. 28 యేళ్ళ రుచి భూటాన్ ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించింది. దీనికి ఆమె భర్త, మీరా చోప్రాలే కారణమంటూ రుచి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలుగులో మీరా చోప్రా ఇంకా "వాన" జగన్మోహిని, మారో" వంటి చిత్రాల్లో నటించింది.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.