English | Telugu

డాక్టర్ రాజశేఖర్, జీవితలకు కోర్టులో అవమానం

డాక్టర్ రాజశేఖర్, జీవితలకు కోర్టులో అవమానం జరిగింది. వివరాల్లోకి వెళితే గతంలో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన బ్లడ్ బ్యాంక్ మీద అనేక అపవాదులు, నిందలు డాక్టర్ రాజశేఖర్, జీవితలు వేసిన విషయం తెలిసిందే. అప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఆ పార్టీకి వ్యతిరేకంగా, చిరంజీవి మీద బురదజల్లే కార్యక్రమంలో భాగంగా రాజశేఖర్ దంపతులు అదే పనిగా రికార్డులతో సహా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఎన్నో అన్యాయాలకూ, అక్రమాలకూ పాల్పడుతుందని ఆరోపణలు చేశారు. దానికి స్పందించిన బ్లడ్ బ్యాంక్ యాజమాన్యం వాళ్ళిద్దరిపై పరువునష్టం దావా వేసింది.

ఆ కేసుకి సంబంధించి మియాపూర్ జడ్జి కోర్టుకి హాజరుకావల్సిందిగా రాజశేఖర్ దంపతులను ఆదేశించింది. కానీ వీరు కోర్టుకి హాజరు కాకపోవటంతో వీళ్ళిద్దరినీ కోర్టుకు హాజరు కావలని లేదా అరెస్ట్ చేస్తామని వార్నింగివ్వటం వలన ఆ దంపతులు మియా పూర్ కోర్టుకి హాజరయ్యారు. కోర్టులో జడ్జి వీళ్ళిద్దర్నీ కోర్టులో మూడు గంటల పాటు కూర్చోవలసిందిగా ఆదేశిస్తూ, వాయిదాలకు హాజరు కాకుండా కోర్టు ఆర్డర్లను ధిక్కరించినందుకు గానూ 500 రూపాయల జరిమానా వేసింది.