English | Telugu

మాస్ జాతర కొత్త రిలీజ్ డేట్.. ఇదైనా నమ్మొచ్చా?

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను బోగవరపు దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కోసం మాస్ రాజా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 'మాస్ జాతర' పలుసార్లు వాయిదా పడింది. దీంతో కొత్త రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. తాజాగా మేకర్స్ కొత్త విడుదల తేదీని ప్రకటించారు. (Mass Jathara)

'మాస్ జాతర' సినిమాని ఈ అక్టోబర్ 31న విడుదల చేయనున్నట్లు తాజాగా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా రవితేజ, హైపర్ ఆదిలపై చిత్రీకరించిన ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. అందులో సినిమా పలుసార్లు వాయిదా పడటంపై సెటైర్లు వేస్తూ, కొత్త విడుదల తేదీని రివీల్ చేయడం సరదాగా ఉంది. వినాయక విగ్రహం మీద ఒట్టేసి మరీ.. అక్టోబర్ 31న సినిమా ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని రవితేజ హామీ ఇచ్చాడు.

'మాస్ జాతర'లో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇది 'ధమాకా' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రవితేజ-శ్రీలీల కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడం విశేషం. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

రవితేజ అభిమానులు, మాస్ ప్రేక్షకులు మెచ్చేలా అన్ని కమర్షియల్ హంగులతో పక్కా మాస్ ఎంటర్టైనర్ గా 'మాస్ జాతర' చిత్రాన్ని మలుస్తున్నారు. 2022 లో వచ్చిన ధమాకా తర్వాత రవితేజ ఖాతాలో కమర్షియల్ సక్సెస్ లేదు. ఆ లోటుని 'మాస్ జాతర' తీరుస్తుందేమో చూడాలి.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.