English | Telugu

నౌ టైం స్టార్ట్ అంటున్న మనోజ్.. మళ్ళీ ఏం చెప్పబోతున్నాడు!

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు(Ntr)ఎవర్ గ్రీన్ హిట్స్ లో 'మేజర్ చంద్రకాంత్' ఒకటి. 1993 వ సంవత్సరంలో వచ్చిన ఈ మూవీ ద్వారానే మంచు మనోజ్(Manchu Manoj)బాలనటుడిగా సిల్వర్ స్క్రీన్ పై కాలుమోపాడు. ఆ తర్వాత 2004 లో వచ్చిన 'దొంగ దొంగది' ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ్నుంచి ఎన్నో మంచి సినిమాల్లో నటిస్తు, తన అద్భుతమైన నటనతో, డైలాగ్ డెలివరీ తో ఎంతో మంది అభిమానులని సంపాదించాడు. నేటికీ ఆయా చిత్రాల్లోని పాటలు, డైలాగ్స్, పోరాట సన్నివేశాలు చాలా మందికి గుర్తున్నాయి. తండ్రి మోహన్ బాబు నట వారసత్వాన్ని ముందుకు పర్ఫెక్ట్ గా ముందుకు తీసుకెళ్తున్నాడని అందరు భావించారు.

కానీ 2017 లో చేసిన 'ఒక్కడు మిగిలాడు' తర్వాత మంచు మనోజ్ ఎటువంటి చిత్రంలో నటించలేదు. కెరీర్ లో ఇంత పెద్ద గ్యాప్ వస్తే అవకాశాలు దొరకడం చాలా కష్టం. కానీ అందుకు భిన్నంగా మనోజ్ ప్రస్తుతం భైరవం అనే మూవీతో పాటు 'మిరాయ్' చేస్తున్నాడు. వీటిలో భైరవం ఈ నెల ౩౦న రిలీజ్ కాబోతుంది. సుమారు పాతిక కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీలో మనోజ్ క్యారక్టర్ కి ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. ఈ విషయం ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది. దర్శకుడు కూడా ప్రమోషన్స్ లో మాట్లాడుతు మనోజ్ గారే ఆ క్యారక్టర్ కి న్యాయం చేయగలడని భావించి సెలెక్ట్ చేసుకున్నామని చెప్పాడు.

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న మిరాయ్(Mirai)లో తేజ సజ్జ(Teja Sajja) హీరో కాగా, మనోజ్ నెగిటివ్ రోల్ లో కనిపిస్తున్నాడు. నెగిటివ్ రోల్ అనే కంటే కథకి చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారక్టర్ అనుకోవచ్చు. రీసెంట్ గా రిలీజైన టీజర్ ఈ విషయాన్నే చెప్తుంది. ఈ రెండు చిత్రాల్లో మనోజ్ నటవిశ్వరూపాన్ని చూడబోతున్నామని ఆయన అభిమానులు అంటున్నారు. మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా చర్చల దశలో ఉన్నాయని తెలుస్తుంది. దీంతో ఎనిమిది సంవత్సరాల తర్వాత మనోజ్ టైం స్టార్ట్ అయ్యిందనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .