English | Telugu
సిఐడి ఆఫీస్ లో మంచు లక్ష్మి.. రీజన్ ఇదే
Updated : Dec 23, 2025
ఎందుకెళ్లింది
అధికారులు ఏమంటున్నారు!
ఏం చెప్పింది
నట ప్రపూర్ణ 'మంచు మోహన్ బాబు'(Mohan Babu)నట వారసురాలిగా మంచు లక్ష్మి(Manchu Lakshmi)కి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. క్యారక్టర్ ఏదైనా సరే సదరు క్యారక్టర్ లోకి పరకాయ ప్రవేశం చేసి మెప్పించడం మంచు లక్ష్మి నటన యొక్క స్టైల్. సామాజిక సేవా పరంగా కూడా ముందు వరుసలో ఉంటు రెండు తెలుగు రాష్టాల్లోని కొన్ని ప్రభుత్వ స్కూల్స్ ని దత్తత తీసుకొని తన సొంత డబ్బుతో విద్యార్థుల భవిష్యత్తుకి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేస్తుంది.
మంచు లక్ష్మి ఈ రోజు హైదరాబాద్ లక్డికపుల్ ఏరియాలో ఉన్న సిఐడి ఆఫీస్ కి వెళ్ళింది. బెట్టింగ్ యాప్ లకి ప్రమోటర్ గా వ్యవహరించిన కేసులో ఆమెపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులోనే ఆమె సిఐడి విచారణకి హాజరయ్యింది. ఈ విచారణలో బెట్టింగ్ యాప్ ల ద్వారా ఆమె అందుకున్న పారితోషకం, కమీషన్ల గురించి అధికారులు పలు వివరాలు రాబట్టినట్టుగా తెలుస్తుంది. ఈ కేసులో మంచు లక్ష్మి గతంలో కూడా విచారణకి హాజరు కాగా ఇప్పుడు మరో మారు హాజరుకావడం చర్చినీయాంశమయ్యింది. ఇక ఇదే బెట్టింగ్ యాప్ కేసుకి సంబంధించి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ తో పాటు పలు సినీ, సోషల్ మీడియా సెలబ్రిటీస్ పై సిఐడి కేసు నడుస్తున్న విషయం తెలిసిందే.
Also Read: ఆ టాప్ హీరోయిన్ నాని ని రిజెక్ట్ చేసిందా! ఫ్యాన్స్ ఏమంటున్నారు
మంచు లక్ష్మి ప్రస్తుత సినీ కెరీర్ విషయానికి వస్తే గత నెలలో 'దక్ష'అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మోహన్ బాబు కూడా ఒక ప్రధానమైన క్యారక్టర్ లో కనిపించాడు.