English | Telugu
యానిమల్ మూవీ చుట్టు ఇంట్రెస్టింగ్ కథలు
Updated : Nov 24, 2023
రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన యానిమల్ మూవీ డిసెంబర్ 1 న రాబోతున్న విషయం అందరికి తెలిసిందే. పైగా నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ తో ప్రేక్షకుల్లో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయి సినిమా విడుదల కోసం అఖండ భారతావని మొత్తం ఎదురుచూస్తుంది. ఇలాంటి టైంలో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన పాయింట్స్ నెట్టింట షికార్లు చేస్తున్నాయి.
ఈ యానిమల్ మూవీ కథని మొదట మహేష్ బాబు కి చెప్పడం జరిగింది. మహేష్ కి కథ నచ్చడంతో చాలా రోజులు సిట్టింగ్ లు కూడా జరిగాయి. కానీ ఎందుకనో ఈ సినిమా మహేష్ తో ముందుకెళ్ళలేదు. ఇప్ప్పుడు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న మహేష్ ఫాన్స్ ఎంతో వర్రీ అవుతున్నారు. ఆల్రెడీ రిలీజ్ అయిన ట్రైలర్ ని మరోసారి చూస్తు మహేష్ ని రణబీర్ క్యారక్టర్ లో ఉహించుకుంటు మహేష్ కనుక యానిమల్ చేసుకుంటే సూపర్ గా ఉండేదని అనుకుంటున్నారు.అలాగే ఈ మూవీకి సంబంధించిన ఇంకో తాజా అప్ డేట్ పేక్షకులని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ మూవీ నిడివి మొత్తం 3 గంటల 21 నిమిషాలుగా ఉండబోతుంది. ఈ విషయాన్నీ స్వయంగా దర్శకుడు సందీప్ చెప్పాడు. మరి ఇంత పెద్ద మొత్తం నిడివి అంటే ప్రేక్షకులు యానిమల్ ని ఎలా రిసీవ్ చేసుంటారో చూడాలి. ఆర్ఆర్ఆర్, బాహుబలి లాంటి సినిమాలే అంత నిడివితో రాలేదు. మరి సందీప్ అండ్ మేకర్స్ కాన్ఫిడెన్స్ కి ఉన్న పవర్ ఎంతో మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది.
అలాగే ఈ మధ్య కాలంలో ఒక హిందీ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు వెయిట్ చేసింది లేదు. అలాంటిది అందరు యానిమల్ కోసం వెయిట్ చేస్తున్నారంటే సందీప్ రెడ్డి అని ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు. అర్జున్ రెడ్డి అనే ఒక్క మూవీతో సందీప్ తెలుగు ప్రేక్షకుల అభిమాన దర్శకుడుగా మారాడు. సుమారు 6 సంవత్సరాల తర్వాత సందీప్ నుంచి ఈ యానిమల్ మూవీ వస్తుండంతో అంచనాలు పీక్ లో ఉన్నాయి. రష్మిక మందన్న రణబీర్ కి జోడిగా నటిస్తుంది