English | Telugu

చొక్కా విప్పుబోతున్న ప్రిన్స్ మహేష్ బాబు

ప్రిన్స్ చొక్కా విప్పుతాడు. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లేదా మన టాలీవుడ్ లతో సహా ఏ సినీ పరిశ్రమలోనైనా హీరోలకు సిక్స్ ప్యాక్ బాడీ అనేది ఈ రోజున అత్యవసరమైందని అంగీకరించాలి. ఆ విధంగా సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సూర్య, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, సునీల్ ఇలా అందరూ సిక్స్ మీద సాధించిన వారే కావటం విశేషం.ఈ కోవలోకి చేరాలని టాలీవుడ్ టాప్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్ హీరో బ్రాడ్ పిట్ ట్రైనర్ గ్రేగ్ జోయ్ జోన్ రోచే ని కోటి రూపాయలిచ్చి మరీ తన ఫిజికల్ ట్రైనర్ గా ఏర్పాటు చేసుకుంటున్నాడని సమాచారం.

తన ముఖంలోని గ్లామర్ తగ్గకుండా బాడీని ఎలా చక్కని ఆకారంలోకి మార్చవచ్చో మహేష్ బాబు ప్రయత్నం చేస్తున్నాడు. అందుకు నాలుగు నెలల సమయాన్ని కేటాయించాడట మహేష్ బాబు. బహుశా సుకుమార్ సినిమాలో మనకు మహేష్ బాబు చొక్కాతీసి కనిపిస్తాడేమో వేచిచూడాలి...!

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.