English | Telugu

మ‌హేష్ ఇంట కొత్త కారు.. ధ‌రేంతో తెలుసా!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు సినిమాల‌తో పాటు ఇత‌ర వ్యాపారాల్లోనూ పెట్టుబ‌డులు పెడుతున్నారు. అలాగే సినిమాల‌తో పాటు క‌మర్షియ‌ల్ యాడ్స్ చేస్తూ కూడా బిజీగా ఉన్నారు. ఆయ‌న లైఫ్ స్టైల్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న కార్ గ్యారేజ్‌లో ఖరీదైన కార్లు ఎన్నో ఉన్నాయి. అయితే తాజాగా ఇప్పుడు ఓ కాస్ట్‌లీ రేంజ్ రోవ‌ర్‌ను మ‌హేష్ కొన్నార‌ని, దానికి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. వివ‌రాల మేర‌కు మ‌హేష్ కొన్న ఆ రేంజ్ రోవ‌ర్ కారు ధ‌రేంతో తెలిస్తే.. వామ్మో అనాల్సిందే. ఏకంగా రూ.5.5 కోట్లు. ఏరి కోరి మ‌హేష్ గోల్డ్ క‌ల‌ర్ రేంజ్ రోవ‌ర్‌ను కొన్నారు.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం ఆయ‌న త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో గుంటూరు కారం సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. అత‌డు, ఖ‌లేజా చిత్రాల త‌ర్వాత మ‌హేష్ - త్రివిక్ర‌మ్ కాంబోలో రాబోతున్న మూవీ ఇది. వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13న సినిమా రిలీజ్ అవుతుంద‌ని మేక‌ర్స్ ఇది వ‌ర‌కే ప్ర‌క‌టించారు. ఇందులో శ్రీలీల‌, మీనాక్షి చౌద‌రి హీరోయిన్స్‌గా న‌టిస్తుండ‌గా సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ అలియాస్ చిన‌బాబు సినిమాను నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. న‌వంబ‌ర్ నాటికి సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాల‌నేది మేక‌ర్స్ ఆలోచ‌న‌.

గుంటూరు కారం మూవీ పూర్తి కాగానే మ‌హేష్ కాస్త గ్యాప్ తీసుకుని రాజ‌మౌళి సినిమాపై ఫోక‌స్ చేస్తారు. రాజ‌మౌళి ఇప్ప‌టికే మ‌హేష్‌తో చేయాల్సిన సినిమాకు సంబంధించిన చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్‌తో పాటు ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను కంప్లీట్ చేసుకునే ప‌నిలో ఉన్నారు. మ‌హేష్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మ‌హేష్‌, జ‌క్క‌న్న మూవీ అనౌన్స్మెంట్ వ‌స్తుంద‌ని ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కులు భావిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.