English | Telugu

మహేష్‌ బాబు హైద్రాబాద్‌ బ్రాండ్‌ అంబాసిడర్..‌?

తెలుగు సినీ పరిశ్రమలో ‘సూపర్‌ స్టార్‌’ ఇమేజ్ ని సొంతంచేసుకున్న మహేష్‌ బాబుని హైద్రాబాద్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించే ఆలోచనలో తెలంగాణ సర్కార్‌ వున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మహేష్‌ బాబును హైద్రాబాద్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా చేయడం వల్ల పలు ఉపయోగాలు వుంటాయని కేసిఆర్ భావిస్తున్నారట. ముఖ్యంగా హైద్రాబాద్‌ లోని ‘సెటిలర్స్‌’ ఓటు బ్యాంకు దీనికి ముఖ్యకారణంగా చెబుతున్నారు. మహేష్‌బాబును హైదరాబాద్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపిక చేస్తే తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా పలువుర్ని ఆకర్షించటం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.