English | Telugu

సూపర్ ఛాన్స్ సొంతం చేసుకున్న తమన్నా !!

అసలే టాలీవుడ్ లో టాప్5 హీరోయిన్ లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న మిల్క్ బ్యూటీ తమన్నా ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మహేష్‌బాబు సరసన నటించే అవకాశం ఏరికోరి ఆమెను వరించడంతో... తమన్నా కి క్రేజ్ మరీ పెరిగిపోయింది. ఇదంతా కామనే కదా అని అనుకోకండి.

నిజానికి మహేష్‌_సుకుమార్ కాంబినేషన్‌లోతెరకెక్కుతున్న "ఒన్ నేనొక్కడినే" చిత్రంలో హీరోయిన్‌గా తమన్నాను తీసుకోవాలనుకున్నారు. కానీ.. తమన్నా డేట్స్ ఖాళీలేనందున, ఆ అవకాశం కాస్త కృతిసనమ్ కి దక్కింది. అయితే తాజాగా శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేష్‌ నటించనున్న "ఆగడు" చిత్రంలో నాయికగా తమన్నా ఎంపికవ్వడంతో ఫిలింనగర్‌లో చర్చనీయాంశంగా మారింది. "దూకుడు" వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత శ్రీనువైట్ల_మహేష్‌బాబు కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడం విశేషం. మరి ఈ చిత్రంతో తమన్నా పొజిషన్ టాలీవుడ్‌లో నెం.1 స్థానానికి చేరుతుందో లేదో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.