English | Telugu

మహావతార్ నరసింహ జోరుకి బ్రేక్ లు లేవు.. టోటల్ గా 15 రోజులకి ఎంతంటే 

రాక్షసరాజు హిరణ్యకశిపుడుని అంతమొందించడానికి, ప్రహ్లాదుడి కోరిక మేరకు శ్రీమహావిష్ణువు స్వయంగా నరసింహస్వామి అవతారం ఎత్తి, హిరణ్యకశిపుడుని అంతమొందిస్తాడు. హిందూమతపురాణాల్లో పొందుపరిచి ఉన్న ఈ అంశంతో, పాన్ ఇండియా వ్యాప్తంగా గత నెల జులై 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'మహావతార్ నరసింహ'. పదిహేనవ రోజు కూడా రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. లాంగ్వేజ్ ల వారీగా పదిహేవవ రోజు సాధించిన కలెక్షన్స్ ని చూసుకుంటే, కన్నడంలో 35 లక్షలు, తెలుగులో 1.85 కోట్లు, హిందీలో 5.75 కోట్లు, తమిళంలో 13 లక్షలు, మలయాళంలో 2 లక్షలు, ఇలా మొత్తంగా 8.10 కోట్ల నెట్ ని వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. మరి డే 1 నుంచి మహావతార్ సాధించిన కలెక్షన్ల వివరాలు చూద్దాం.

1 st డే 2 కోట్ల రూపాయలు,
2వ రోజు 4.5 కోట్లు,
3వ రోజు 9.5 కోట్లు
4 వ రోజు 6 కోట్లు,
5వ రోజు 7.5 కోట్లు,
6వ రోజు 7.5 కోట్లు,
7వ రోజు 7 కోట్లు,
8వ రోజు7.5 కోట్లు,
9వ రోజు 15.4 కోట్లు,
10వ రోజు 23.1 కోట్లు,
11వ రోజు 7.35 కోట్లు,
12వ రోజు 8.5 కోట్లు,
13వ రోజు 6 కోట్లు,
14వ రోజు 5.35 కోట్లు
ఇక 15 వ రోజు 8.10 కోట్లు ఈ విధంగా 2 వారాలు పూర్తయ్యే సరికి 73.4 కోట్ల రూపాయిల నెట్ ని రాబట్టినట్టుగా తెలుస్తుంది.

ఈ విధంగా తొలి రోజు నుంచి పదిహేను రోజుల వరకు చూసుకుంటే తెలుగు స్టేట్స్ 28 కోట్లు రూపాయిలు, కన్నడంలో 3.50 కోట్లు, హిందీలో 93 కోట్లు, తమిళంలో 1.50 కోట్లు, మలయాళంలో 32 లక్షలు. టోటల్ గా ఇండియా 127 కోట్ల నెట్ కలెక్షన్స్ ని సాధించినట్టుగా తెలుస్తుంది. ఇదే కలెక్షన్స్ ని గ్రాస్ వారీగా చూసుకుంటే ఇండియా వ్యాప్తంగా 150 కోట్లు, ఓవర్సీస్ లో 6 కోట్లుతో కలుపుకొని వరల్డ్ వైడ్ గా 160 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ విధంగా మహావతార్ నర్సింహా స్టార్ హీరోలకి ధీటుగా రికార్డు కల్లెక్షన్స్ తో దూసుకుపోతుంది. 15 కోట్ల రూపాయల బడ్జెట్ తో మహావతార్ నిర్మాణం జరుపుకుంది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం