English | Telugu

కొత్త రూపంతో మ్యాడ్ మూవీ..యూత్ కి కిక్కే కిక్కు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ అండ్ రామ్ నితిన్, సంగీత్ శోభన్ ,అనంతిక ,గౌరీ ప్రియ తదితరులు నటించిన సూపర్ సూపర్ హిట్ మూవీ మ్యాడ్. నూతన దర్శకుడు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కిన మ్యాడ్ మూవీ గత నెలలో రిలీజ్ అయ్యి సంచలన విజయం సాధించింది. యూత్ మొత్తం మ్యాడ్ కి దాసోహమయ్యింది. ఇప్పుడు మ్యాడ్ మూవీ కి సంబంధించిన ఒక నయా వార్త యూత్ ని సినీ అభిమానులని ఆనందంలో ముంచెత్తుతుంది.
మ్యాడ్ మూవీ ఈ రోజు నుంచి యూత్ కి మరింత చేరువ కాబోతుంది. ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ ద్వారా ఈ రోజు అందరి ఇళ్లలోకి అడుగుపెట్టబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా గతనెల అక్టోబర్ 6 న నెంబర్ ఆఫ్ థియేటర్స్ లో రిలీజ్ అయిన మ్యాడ్ మూవీ ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇప్పుడు ఓటిటి లోకి అడుగుపెట్టింది.
హిట్ చిత్రాల నిర్మాత సూర్యదేవర నాగ వంశీ నిర్మాణ సారథ్యం లో తెరకెక్కిన మ్యాడ్ మూవీ యూత్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి మంచి వసూళ్లనే సాధించింది. మూవీలో నటించిన వాళ్ళందరూ కొత్త వాళ్ళయినా కూడా సూపర్ గా నటించి సినిమా ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.మ్యాడ్ మూవీ రిలీజ్ అయిన అన్ని థియేటర్లలో కూడా రికార్డు స్థాయి కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. థియేటర్ లో ఎంజాయ్ చేసిన యూత్ కి ఇప్పుడుమ్యాడ్ మూవీ నయా రూపంతో కిక్కు రావడం పక్కా.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.