English | Telugu

ఓటీటీలోకి 'మా నాన్న సూపర్ హీరో' మూవీ...

సుధీర్ బాబు, షాయాజీ షిండే, సాయిచంద్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'మా నాన్న సూపర్ హీరో'. వి సెల్యులాయిడ్స్ బ్యానర్ పై సునీల్ బలుసు నిర్మించిన ఈ సినిమాకి 'లూజర్' వెబ్ సిరీస్ ఫేమ్ అభిలాష్ కంకర దర్శకుడు. అక్టోబర్ 11న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా పరవాలేదు అనిపించుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది. (Maa Nanna Superhero On Zee5)

'మా నాన్న సూపర్ హీరో' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని జీ5 సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని నవంబర్ 15 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా జీ5 ప్రకటించింది. థియేటర్లలో విడుదలైన ఐదు వారాలకు ఓటీటీలో అడుగుపెడుతున్న ఈ మూవీ ఎలాంటి స్పందనను తెచ్చుకుంటుందో చూడాలి.

'మా నాన్న సూపర్ హీరో' సినిమా కథ ఏంటంటే...
జానీ (సుధీర్ బాబు) పుట్టుకతోనే తల్లిని పోగొట్టుకుంటాడు. తండ్రి ప్రకాష్ (సాయిచంద్) చేయని తప్పుకి జైలు పాలవుతాడు. దీంతో జానీ అనాథాశ్రమంలో పెరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలో అతన్ని శ్రీనివాస్ (షాయాజీ షిండే) దత్తత తీసుకుంటాడు. మొదట్లో జానీని బాగానే చూసుకుంటాడు. కానీ ఆ తర్వాత తన భార్య చనిపోవడం, ఆర్థికంగా చితికిపోవడంతో.. జానీ రాకను తన కుటుంబానికి అరిష్టంగా భావించి.. అతనిపై కోపం పెంచుకుంటాడు శ్రీనివాస్. కానీ జానీ మాత్రం శ్రీనివాస్ ని కన్న తండి కంటే ఎక్కువగా ప్రేమిస్తుంటాడు. ఇదిలా ఉండగా శ్రీనివాస్ ని ఒక రాజకీయనాయకుడు జైల్లో పెట్టిస్తాడు. అతన్ని కాపాడాలంటే 20 రోజుల్లో కోటి రూపాయలు సర్దాల్సి వస్తుంది. దీంతో ఆ బాధ్యతను జానీ తీసుకుంటాడు. మరోవైపు 20 ఏళ్ళ తర్వాత జైలు నుంచి విడుదలైన ప్రకాష్ తన కొడుకుని వెతుక్కుంటూ వస్తాడు. పెంచిన తండ్రి శ్రీనివాస్ ని కాపాడుకోవడం కోసం జానీ ఏం చేశాడు? తన కొడుకు జానీని కన్న తండ్రి ప్రకాష్ కలుసుకున్నాడా? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.