English | Telugu

మ్యాడ్ స్క్వేర్ కి మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్!

నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌ ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన సినిమా 'మ్యాడ్ స్క్వేర్'. 2023 లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'మ్యాడ్'కి సీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రం.. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న మ్యాడ్ స్క్వేర్.. అదిరిపోయే వసూళ్లతో సత్తా చాటుతోంది. (Mad Square Collections)

'మ్యాడ్' వంటి సూపర్ హిట్ కామెడీ ఫిల్మ్ కి సీక్వెల్ కావడంతో పాటు, వేసవి సెలవులు తోడు కావడంతో.. మ్యాడ్ స్క్వేర్ రికార్డు ఓపెనింగ్స్ రాబట్టింది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.20.8 కోట్ల గ్రాస్ రాబట్టింది. రెండో రోజు కూడా అదే జోరు చూపిస్తూ రూ.16.4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో రెండు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.37.2 కోట్ల గ్రాస్ సాధించింది.

మూడు రోజు ఆదివారం కావడంతో మరో రూ.15-20 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశముంది. దీంతో మూడు రోజుల్లోనే మ్యాడ్ స్క్వేర్ రూ.50 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరనుంది. ఇక నాలుగో రోజు రంజాన్ సెలవు కావడం కూడా ఈ సినిమాకి కలిసొచ్చే ఛాన్స్ ఉంది. యూత్ ఎంజాయ్ చేసే కామెడీ సినిమా కావడంతో.. ఫుల్ రన్ లో మ్యాడ్ స్క్వేర్ రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినా ఆశ్చర్యంలేదు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం