English | Telugu

జపాన్ లో దేవరకి ఊహించని కలెక్షన్స్..!

జపాన్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఇండియన్ స్టార్స్ లో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఒకరు. ఎన్టీఆర్ ఎనర్జిటిక్ డ్యాన్స్ లకు జపాన్ లో ఎందరో అభిమానులు ఉన్నారు. 'ఆర్ఆర్ఆర్' రాకముందే, 'బాద్‍షా' టైంలోనే తారక్ కి అక్కడ ఫ్యాన్స్ ఉండేవారు. ఇక 'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ ఇమేజ్ పొందిన ఎన్టీఆర్.. ఇప్పుడు జపాన్ మార్కెట్ పై మరింత ఫోకస్ పెడుతున్నాడు. ఈ క్రమంలోనే తన రీసెంట్ బ్లాక్ బస్టర్ 'దేవర'తో జపాన్ ప్రేక్షకులను పలకరించాడు. (Devara In Japan)

'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ నటించిన మూవీ 'దేవర'. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, గతేడాది సెప్టెంబర్ 27న థియేటర్లలో అడుగుపెట్టింది. దేవర మూవీ డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. మంచి వసూళ్లు రాబట్టి, ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.500 కోట్ల గ్రాస్ రాబట్టి.. ఎన్టీఆర్ స్టార్డంను మరోసారి నిరూపించింది. ఇప్పుడు ఈ సినిమా జపాన్ ప్రేక్షకులను అలరిస్తోంది.

దేవర సినిమా జపాన్ లో మార్చి 28న విడుదలైంది. ఎన్టీఆర్ స్వయంగా జపాన్ వెళ్ళి, అక్కడ ప్రమోషన్స్ చేయడం విశేషం. దీంతో ఈ మూవీ రికార్డు ఓపెనింగ్స్ రాబడుతోంది. ఈ సినిమాకి ప్రీమియర్స్ ఫుట్ ఫాల్స్ 2308 కాగా, ఫస్ట్ డే ఫుట్ ఫాల్స్ 1553. ఇక రెండో రోజు మొదటిరోజుకి మించిన ఫుట్ ఫాల్స్ నమోదు కావడం విశేషం. జపాన్ లో దేవర సెకండ్ డే ఫుట్ ఫాల్స్ 2327. ప్రీమియర్స్ తో కలిపి మొదటి రెండు రోజుల్లోనే 6188 అడ్మిట్స్ నమోదు అయ్యాయి. ఇండియన్ సినిమాల పరంగా ఇది రికార్డు ఫుట్ ఫాల్స్ లో ఒకటిగా చెప్పవచ్చు.

జపాన్ లో దేవర రెండు రోజుల్లోనే 11.1 మిలియన్ యెన్స్ కలెక్ట్ చేసింది. ఇక మూడో రోజు రెండోరోజుకి మించిన ఫుట్ ఫాల్స్ నమోదవుతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే జోరు కొనసాగితే ఫుల్ రన్ లో దేవర.. అక్కడ రికార్డు వసూళ్ళు రాబట్టే అవకాశముంది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం