English | Telugu

ఎవరితోనైనా లిప్ లాక్ కు రెడీ

తమిళ ‘‘గుంకీ’’ సినిమా ద్వారా చిత్రపరిశ్రమకు పరిచయమైన నటి లక్ష్మీ మీనన్. ఇప్పుడు ఏ హీరోతోనైనా లిప్ లాక్ సన్నివేశాల్లో నటించడానికి నేను రెడీ అంటోంది. మొదటి సినిమాలో డీ గ్లామర్ రోల్ లో నటించి విమర్శకుల ప్రశ౦సలు అందుకున్న ఈ భామ గ్లామర్ పాత్రలకు సెట్ కాదని అందరూ అనుకున్నారు. కానీ ఆ తరువాత చేసిన సినిమాల్లో అదరచుంబనాలు, బెడ్ రూమ్ సన్నివేశాల్లో ఈమె జీవించిన తీరు అందరినీ మతిభ్రమించేలా చేశాయి. ఇప్పుడు వరుస హిట్లలతో టాప్ రేంజ్ లో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు సిద్దార్థ్ సరసన జిగర్ తాండ సినిమాలో నాయికగా నటిస్తుంది.అయితే ఈమె ప్రతి సినిమాల్లో ఇస్తున్న లిప్ లాక్ విషయం గురించి ఈమెను ప్రశ్నిస్తే.. అందుకు ఘాటుగానే సమాధానం ఇచ్చింది.‘‘ఏ హీరో అయినా నాకు ఫర్వా లేదు. వుంటాను. ఆ సన్నివేశాల్లో నటించడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు’’ అని స్పష్టం చేసేసింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.