English | Telugu

బన్నీ తో కలిసి నటించాలని ఉందంటున్న మహేష్ హీరోయిన్..ఇది సుకుమార్ పనేనా! 

ఏ ముహూర్తాన సుకుమార్ అల్లు అర్జున్ కి ఐకాన్ స్టార్ అనే బిరుదుని నామకరణం చేసాడో కానీ ఆ బిరుదుకి సార్ధకం చేస్తు69 సంవత్సరాల తెలుగు చలన చిత్ర చరిత్రలో ఏ తెలుగు నటుడు సాధించని జాతీయ అవార్డు ని బన్నీ సాధించి తెలుగు వారి కీర్తి పతాకాన్ని విశ్వ వ్యాప్తం చేసాడు. ఇప్పుడు బన్నీ గ్లోబల్ స్టార్. దీంతో బన్నీతో నటించడానికి దక్షిణ భారతీయ చిత్ర సీమతో పాటు హిందీ చిత్ర సీమకి చెందిన చాలా మంది నటీమణులు పోటీపడుతున్నారు. ఇప్పుడు వీళ్లల్లో ఒక టాప్ హీరోయిన్ కూడా చేరింది.

మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 1 చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైన నటి కృతిసనన్. లేటెస్ట్ గా ప్రభాస్ ఆదిపురుష్ లో సీతగా నటించిన కృతి తనకి అల్లు అర్జున్ తో నటించాలనే కోరిక ఉందని చెప్పింది. బన్నీ నటన చాలా బాగుంటుందని పైగా తెలుగు వారికి ఎప్పుడు రాని జాతీయ అవార్డు ని సైతం సాధించిన గొప్ప నటుడు అని కూడా కృతి బన్నీ మీద ప్రశంసల వర్షాన్ని కురిపించింది. అలాగే బన్నీని తాను కలిసిన విషయం కూడా కృతి చెప్పింది.

బన్నీ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ని అందుకునే సమయంలో కృతి కూడా జాతీయ ఉత్తమ నటి అవార్డు ని అందుకుంది.ఈ సమయంలో బన్నీ ని మొదటిసారి కలిసి మాట్లాడానని అప్పుడే నాకు బన్నీ అంటే ఏంటో అర్ధమైందని చెప్పింది. ఎవరైనా నిర్మాతలు ,దర్శకులు మంచి కథతో వస్తే బన్నీ తో కలిసి నటించడానికి సిద్ధంగా ఉన్నానని కృతి చెప్పుకొచ్చింది.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.