English | Telugu

‘కృష్ణారామా’ మూవీ రివ్యూ

మూవీ : కృష్ణారామా
నటీనటులు: రాజేంద్ర ప్రసాద్,
గౌతమి, అనన్య శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, జెమిని సురేష్, రచ్చ రవి, రవి వర్మ తదితరులు
ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖీ
సినిమాటోగ్రఫీ: రంగనాథ్ గోగినేని
మ్యూజిక్: సునీల్ కశ్యప్
నిర్మాతలు: వెంకట కిరణ్, హేమ మాధురి
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: రాజ్ మాదిరాజు

ఓటిటి వేదికలపై కొత్త కథలకి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. అందులోను ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి సినిమాలతో లైఫ్ టైమ్ గుర్తుండిపోయే సినిమాల్లో తనదైన ముద్ర వేసుకున్న రాజేంద్ర ప్రసాద్ నటించిన మూవీ 'కృష్ణారామా'. తెలుగు ఈటీవి విన్ ఓటిటి వేదికలో విడుదలైన ఈ సినిమా కథేంటో ఒకసారి చూసేద్దాం...

కథ:

రామతీర్థ, కృష్ణవేణి ఇద్దరు దంపతులు అన్యోన్యంగా జీవిస్తుంటారు. వీరిద్దరు ఉపాధ్యాయులు. వీరికి ముగ్గురు సంతానం కాగా ఆ ముగ్గురు విదేశాల్లో సెటిల్ అవుతారు. రామతీర్థ, కృష్ణవేణి ఇద్దరు నెలలో ఒక్కరోజు మాత్రమే వాళ్ళని చూసి మాట్లాడే అవకాశం ఉంటుంది. దీంతో పిల్లలని రోజు చూడాలి, మాట్లాడాలని ఉద్దేశ్యంతో ప్రీతీ(అనన్య శర్మ) సహాయంతో సోషల్ మీడియా మాధ్యమం అయినటువంటి ఫేస్ బుక్ లో #కృష్ణారామా పేరుతో అకౌంట్ క్రియేట్ చేస్తారు. అలా కృష్ణవేణి, రామతీర్థ ఇద్దరు ఫుల్ ఫేమస్ అవుతారు‌. అయితే ఈ క్రమంలో ఇద్దరి మధ్య దూరం పెరిగి, విడిపోయే స్థితికి వస్తుంది. ఆత్మహత్యకు ప్రయత్నిస్తారు. మరి పిల్లల విషయంలో వారి లక్ష్యం నెరవేరిందా లేదా? ప్రీతీకి, వీరికి మధ్య సంబంధం ఏంటో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.


విశ్లేషణ:

పిల్లలని బాగా చదివించి విదేశాల్లో ఉద్యోగం వచ్చేలా చేసి, వారికి దూరంగా ఉంటే ఆ భాద ఎలా ఉంటుందో తెలిపే తల్లిదండ్రుల కథ ఇది. కృష్ణారామా సూసైడ్ కి ప్రయత్నిస్తునే ఫస్ట్ షాట్ తో డైరెక్ట్ కథలోకి తీసుకెళ్ళాడు డైరెక్టర్ రాజ్. పిల్లలకి దూరంగా ఉండే తల్లిదండ్రుల బాధని కళ్ళకి కట్టినట్లుగా చూపించాడు డైరెక్టర్. టెక్నాలజీ గురించి తెలియకపోయిన కొడుకుల కోసం ఎంతకైనా తెగిస్తాం, ఏం అయిన నేర్చుకుంటామంటూ ఫేస్ బుక్ ఖాతాని ఓపెన్ చేయడం, ఫోటోలు దిగి మరి అప్లోడ్ చేయడం అన్నీ నవ్విస్తాయి.

పిల్లల కోసం వాళ్ళు చేసే ప్రతీ పని అమాయకత్వంగాను, ఆలోచింపజేసేలా ఉంటాయి. కథని మొదటి నుండి సరదాగా చూపిస్తూ ఇంటర్వెల్ కి సీరియస్ టచ్ ఇచ్చి ద్వితీయార్థంపై ఆసక్తిని కలిగించిన తీరు బాగుంది. సెకంఢాఫ్ ని సీరియస్ గా మలిచాడు. పిల్లల కోసం సోషల్ మీడియాలోకి వచ్చిన తల్లిదండ్రులు ఎలా ఉన్నారనేది ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు డైరెక్టర్. కృష్ణారామా, వాళ్ల పిల్లలకి మధ్య సీన్లని ఇంకా ఎక్కువగా చూపిస్తే బాగుండేది. ఓ అమ్మాయికి అన్యాయం జరిగితే పోలీసులు నిందితుడిని ఎన్ కౌంటర్ చేయడం వంటివి ఇప్పటికే మనం చాలా సినిమాలలో చేశాం. వాటిని కృష్ణారామా ద్వారా చూపించడం మాములుగా అనిపిస్తుంది. కథలో కొత్తదనం ఉన్నా‌ దానిని పక్కన పెట్టి, సమాజంలో జరిగే అత్యాచారాలని ఇందులో యాడ్ చేయడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కృష్ణవేణి, రామతీర్థ ఇద్దరు ఫేమస్ అయ్యాక వాళ్ళు ఎదుర్కొన్న సవాళ్లు నిజంగా సమాజాన్ని ఆలోచింపజేసేలా ఉన్నాయి.

కొన్ని సీన్లలో ఎమోషన్స్ ని పండిస్తూ బుర్రకథ తరహాలో ఓ బ్యాండ్ తెరపై కనిపిస్తూ ఆకట్టుకుంది. అడల్డ్ సీన్స్ ఏమీ లేకుండా డైరెక్టర్ జాగ్రత్తగా చూసుకున్నాడు. సినిమా ముగింపు బాగుంది. అటు పెద్దలు, ఇటు పిల్లలు ఇద్దరిని కనెక్ట్ చేస్తూ తీసిన ఈ 'కృష్ణారామా' సింపుల్ గా బాగుంది. సునీల్ కశ్యప్ అందించిన బిజిఎమ్ అలరిస్తుంది. డైలాగ్స్ సినిమాకి అదనపు బలం. రంగానాథ్ గోగినేని కెమారా పనితనం ప్రతీ ఫ్రేమ్ లో తెలుస్తుంది. జునైద్ సిద్దిఖీ ఎడిటింగ్ హుందాగా ఉంది. సెకంఢాఫ్ లో కాస్త ట్రిమ్ చేయొచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

రామతీర్థగా రాజేంద్రప్రసాద్ ఈ సినిమాకి ప్రధాన బలం. కృష్ణవేణి పాత్రలో గౌతమి ఆకట్టుకుంది. పక్కింటి అమ్మాయిలా అనిపించే ప్రీతీ పాత్రలో అనన్య శర్మ ఉన్నంతలో హుందాగా నటించింది. శ్రీకాంత్ అయ్యంగార్, రచ్చ రవి, జెమిని కిరణ్ వారి పాత్రలకి న్యాయం చేశారు.

తెలుగువన్ పర్ స్పెక్టివ్:

సకుటుంబ సపరివార సమేతంగా చూసే సినిమా ఇది. ప్రతీ ఇంట్లోని అమ్మానాన్నలని గుర్తుచేసే ఈ 'కృష్ణారామా'.. వృద్దులనే కాదు పిల్లలని ఆలోచింపజేస్తుంది.


రేటింగ్: 2.75 / 5

✍🏻. దాసరి మల్లేశ్

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.