English | Telugu

మెగాస్టార్ సినిమాలో విలన్ గా యంగ్ హీరో!

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి 'సంక్రాంతి అల్లుడు' అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. 2025 సంక్రాంతికి 'సంక్రాంతికి వస్తున్నాం'తో రీజినల్ ఇండస్ట్రీ హిట్ అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నాడు రావిపూడి. పైగా వింటేజ్ చిరంజీవిని చూడబోతున్నారని మూవీ టీం చెబుతోంది. దీంతో ఈ సినిమా కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడీ 'సంక్రాంతి అల్లుడు'కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే ఇందులో యంగ్ హీరో కార్తికేయ విలన్ గా నటించబోతున్నాడట.

యువ హీరోలు, దర్శకులలో చిరంజీవికి ఎందరో అభిమానులున్నారు. వారిని చిరు ఎంకరేజ్ చేస్తుంటారు. ఇప్పటికే యంగ్ హీరో సత్యదేవ్ 'గాడ్ ఫాదర్' మూవీలో నెగటివ్ రోల్ చేసి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ అవకాశం కార్తికేయకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కార్తికేయకు ఇప్పటికే విలన్ గా నటించిన అనుభవముంది. నాని 'గ్యాంగ్ లీడర్', అజిత్ 'వలిమై' వంటి సినిమాల్లో విలన్ గా నటించి ఈ కుర్ర హీరో మెప్పించాడు. ఇప్పుడు ఏకంగా తన అభిమాన నటుడు చిరంజీవిని ఢీ కొట్టే పాత్ర చేయబోతున్నాడు.

'ఆర్ఎక్స్ 100'తో యువతకు చేరువైన కార్తికేయ.. ఆ తర్వాత హీరోగా ఆస్థాయి విజయాన్ని అందుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే విలన్ గా సత్తా చాటాలని చూస్తున్నాడు. మరి ఇప్పుడు మెగాస్టార్ మూవీ కార్తికేయ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుందేమో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.