English | Telugu

కళ్యాణ్‌రామ్ ‌‘పటాస్‌’ టైటిల్‌ లోగో

'అతనొక్కడే’ నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా నటిస్తూ నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో నిర్మిస్తున్న భారీ చిత్రం ‘పటాస్‌’. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ లోగోను ఈరోజు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది.

సాయి కార్తీక్‌ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియోను డిసెంబర్‌ 7న చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నారు. డిసెంబర్‌ నెలలోనే చిత్రాన్ని కూడా వరల్డ్‌వైడ్‌గా విడుదల చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నారు.

సాయికుమార్‌, బ్రహ్మానందం, అశుతోష్‌ రాణా, ఎమ్మెస్‌ నారాయణ, శ్రీనివాసరెడ్డి, జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు మిగతా పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సర్వేష్‌ మురారి, సంగీతం: సాయి కార్తీక్‌, ఎడిటింగ్‌: తమ్మిరాజు, ఆర్ట్‌: ఎం.కిరణ్‌కుమార్‌, ఫైట్స్‌: పటాస్‌ వెంకట్‌, రచనా సహకారం: ఎస్‌.క్రిష్ణ, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎస్‌.జె.ఫణికుమార్‌, చీఫ్‌`కోడైరెక్టర్‌: సత్యం, కో`డైరెక్టర్స్‌: ఎస్‌.క్రిష్ణ, మహేష్‌ ఆలంశెట్టి, నిర్మాత: నందమూరి కళ్యాణ్‌రామ్‌, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అనిల్‌ రావిపూడి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.