English | Telugu

Kaalarathri OTT : ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్.. తెలుగులోను స్ట్రీమింగ్!


ఇంట్లో ఉండే సినిమాలు చూసే అద్భుతమైన అవకాశాన్ని ఓటీటీలు అందిస్తున్నాయి. సినిమా లవర్స్ ఎవరైనా థియేటర్లలో మిస్ అయినవి కానీ కొత్త సినిమాలు కానీ వీకెండ్ లో ఇంట్లో కూర్చొని చూసుకోవడానికి వీలుగా ఢిఫరెంట్ ఓటీటీలు వచ్చేశాయి.

ఈ మధ్య ఓటీటీలో ఇతర భాషా చిత్రాలు డబ్బింగ్ చేసుకొని తెలుగులోకి వచ్చేస్తున్నాయి. అవి కొన్ని అత్యదిక వీక్షకాధరణ పొందగా మరికొన్ని మాములుగా మౌత్ టాక్ తో గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. అలా ఈ మలయాళం నుండి ఓ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తెలుగులోకి ఈ శనివారం అనగా అగస్ట్ 17 న స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. అదే కాళరాత్రి(Kaalarathri). నల్ల నిళవుల రాత్రి పేరుతో మలయాళంలో గతేడాది థొయేటర్లలో విడుదలవ్వగా మిశ్రమ స్పందనలు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు డైరెక్ట్ ఓటీటీలోకి రావడానికి సిద్దమైంది.

బాబు రాజ్, చెంబన్ వినోద్ తదితరులు నటించిన 'కాళరాత్రి'(Kaalarathri).. ట్రైలర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో నిండి ఉంది. కొంతమంది స్నేహితులు కలిసి తక్కువ ధరకే 122 ఎకరాల తోటని కొనడానికి వస్తారు. అయితే ఆ తోట మధ్యలో ఓ గెస్ట్ హౌస్ ఉంటుంది. అది చూసి వారంతా సూపర్ ఎక్సైట్ అవుతారు. ఇక వాళ్ళంతా కలిసి పార్టీ జరుపుకుంటారు. రాత్రి అవ్వగానే వాళ్ళలో కొంతమంది అనూహ్యంగా మరణిస్తారు. అసలు ఆ గెస్ట్ హౌస్ లో ఏం ఉంది? వారు చనిపోడానికి కారణమేంటనేది తెలియాలంటే 'కాళరాత్రి(Kaalarathri ) చూడాల్సిందే. సూపర్ సస్పెన్స్ తో సాగే థ్రిల్లర్ ని ఈ వీకెండ్ కి మిస్ అవ్వకండి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.