English | Telugu

శివాజీకి మద్దతుగా జూనియర్ ఎన్టీఆర్.. ఒక్కసారిగా లెక్కలు మారాయి!

ఇటీవల ప్రముఖ నటుడు శివాజీ(Sivaji) పేరు వార్తల్లో బాగా నానింది. ఇలాంటి తరుణంలో శివాజీని ప్రశంసిస్తూ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) ట్వీట్ చేయడం, దానికి శివాజీ రిప్లై ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

శివాజీ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం 'దండోరా'(Dhandoraa). క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలైన ఈ సోషల్ డ్రామా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కమర్షియల్ గా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయలేకపోయినప్పటికీ.. ఓటీటీలోకి అడుగుపెట్టిన తర్వాత ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ కూడా 'దండోరా'ను ప్రశంసిస్తూ ట్వీట్ చేయడం విశేషం.

"ఇప్పుడే 'దండోరా' చూశాను. ఇది ఎంతో ఆలోచింపజేసేది మరియు శక్తివంతమైన సినిమా. శివాజీ గారు, నవదీప్, నందు, రవి కృష్ణ, బిందు మాధవి అద్భుతంగా నటించారు. ఇలాంటి రూటెడ్ స్టోరీని అద్భుతంగా రాయడమే కాకుండా, అంతే అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చిన దర్శకుడు మురళీకాంత్ గారికి హ్యాట్సాఫ్. ఇలాంటి మంచి ప్రయత్నానికి అండగా నిలిచిన నిర్మాత రవీంద్ర బెనర్జీ గారికి అభినందనలు. ఈ గొప్ప చిత్రంలో భాగమైన ప్రతి ఒక్కరికీ అభినందనలు." అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

ఎన్టీఆర్ ట్వీట్ కి శివాజీ రిప్లై ఇచ్చారు. "మీ హృదయపూర్వక ప్రశంసకు ధన్యవాదాలు ఎన్టీఆర్ గారు. మీ ప్రశంస ఇలాంటి మరిన్ని బలమైన కథలను చెప్పడానికి మమ్మల్ని ప్రేరేపిస్తుంది." అని శివాజీ అన్నారు.

Also Read: దండోరా మూవీ రివ్యూ

'దండోరా' విడుదలకు ముందు వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. హీరోయిన్ల వస్త్రధారణపై శివాజీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఓ రకంగా ఈ వివాదం శివాజీ వర్సెస్ అనసూయగా మారి.. ఆ సమయంలో ఎక్కడ చూసినా ఇదే విషయం గురించి చర్చ జరిగింది.

ఈ వివాదం వార్తల్లో హైలైట్ గా నిలిచి, 'దండోరా' సినిమా గురించి పెద్దగా ఎవరూ మాట్లాడుకోలేదు. దాంతో ఒక మంచి సినిమా జనాల్లోకి వెళ్లాల్సినంతగా వెళ్ళలేదు. ఓటీటీలో విడుదలయ్యాక పలువురు ఈ సినిమా చూసి.. థియేటర్లలో మంచి సినిమాని మిస్ అయ్యామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇక తాజాగా ఎన్టీఆర్ ట్వీట్ తో ఓటీటీలో 'దండోరా' వ్యూయర్ షిప్ ఒక్కసారిగా పెరిగిపోయిందట. దీంతో రికార్డు వ్యూస్ నమోదవ్వడం ఖాయమని చెబుతున్నారు. కాగా, అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'దండోరా' స్ట్రీమ్ అవుతోంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం