English | Telugu

జపాన్ వెళ్లేముందు నీల్ తో ఎన్టీఆర్ భేటీ.. భయం కనిపిస్తుంది!

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఒక భారీ యాక్షన్ ఫిల్మ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డ్రాగన్ టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ మూవీ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. మొదట ఎన్టీఆర్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఏప్రిల్ నుంచి ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొనే అవకాశముంది. (NTR Neel)

ఇటీవల హైదరాబాద్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించిన నీల్.. ప్రస్తుతం షూటింగ్ కి బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ బ్రేక్ లో ఎన్టీఆర్, నీల్ మీట్ అయినట్లు సమాచారం. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్న ఫొటోని నీల్ భార్య లిఖిత సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాదు, వీరిద్దరినీ చూస్తే భయం అనే ఒకే ఒక్క మాట గుర్తుకొస్తుంది అని ఆమె రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎన్టీఆర్ ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 అనే బాలీవుడ్ ఫిల్మ్ చేస్తున్నాడు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 14న విడుదల కానుంది. మరోవైపు ఎన్టీఆర్ గత చిత్రం 'దేవర' మార్చి 28న జపాన్ లో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ కోసం తాజాగా జపాన్ లో అడుగుపెట్టాడు ఎన్టీఆర్.

మొత్తానికి ఓ వైపు వార్-2, దేవర షూటింగ్, మరోవైపు దేవర జపాన్ ప్రమోషన్స్ తో ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉన్నాడు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.