English | Telugu

బాలకృష్ణ, ప్రభాస్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు!

తెలుగునాట బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు, ఇన్‌ఫ్లుయన్సర్స్ పై కేసులు నమోదయ్యాయి. తాజాగా బెట్టింగ్ యాప్స్ కేసులో టాలీవుడ్ బడా స్టార్స్ బాలకృష్ణ (Balakrishna), ప్రభాస్ (Prabhas) లపై పోలీసులకు ఫిర్యాదు అందటం హాట్ టాపిక్ గా మారింది.

ఫన్ 88 అనే బెట్టింగ్ యాప్ కి హీరోలు బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ ప్రమోషన్ చేశారంటూ రామారావు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ యాప్ వల్ల ఎందరో డబ్బు పోగొట్టుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మరి ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి. (Betting App Case)

బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేశారంటూ విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి వంటి హీరోలపై కూడా ఇటీవల పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అయితే తాము స్కిల్ బేస్డ్ గేమ్స్ కి మాత్రమే ప్రమోషన్ చేశామని విజయ్, రానా క్లారిటీ ఇచ్చారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.