English | Telugu

ఘనంగా నార్నే నితిన్ నిశ్చితార్థం.. ప్రత్యేక ఆకర్షణగా ఎన్టీఆర్! 

యంగ్ హీరో నార్నే నితిన్ పెళ్లి పీటలెక్కుతున్నాడు. నేడు హైదరాబాద్ లో నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంతో పాటు, ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. (Narne Nithin Engagement)

జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీప్రణతి సోదరుడు నితిన్ అనే విషయం తెలిసిందే. ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో ఎన్టీఆర్ ఫ్యామిలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భార్య లక్ష్మీప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ తో కలిసి ఎన్టీఆర్ సందడి చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎన్టీఆర్ క్లాస్ లుక్ లో కనిపిస్తున్నాడు.

'మ్యాడ్' వంటి సూపర్ హిట్ ఫిల్మ్ తో టాలీవుడ్ కి పరిచయమైన నితిన్, ఇటీవల 'ఆయ్'తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. నితిన్ పెళ్ళాడుతున్న యువతిది నెల్లూరు అని, హీరో వెంకటేష్ కి బంధువులని తెలుస్తోంది.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.