English | Telugu

తెలుగునాట 'అమరన్'కి బ్రహ్మరథం.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్!

ఈ దీపావళికి తెలుగు సినిమాలు 'క', 'లక్కీ భాస్కర్'తో పాటు, తమిళ సినిమా 'అమరన్', కన్నడ సినిమా 'బఘీర' థియేటర్లలో అడుగుపెట్టాయి. వీటిలో 'బఘీర' తప్ప మిగిలిన మూడు సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా 'అమరన్'కి తెలుగులో ఊహించని రెస్పాన్స్ లభిస్తోంది. (Amaran Collections)

తెలుగు రాష్ట్రాల్లో రూ.5 కోట్ల థియేట్రికల్ బిసినెస్ చేసిన అమరన్.. కేవలం మూడు రోజుల్లోనే రూ.7 కోట్లకు పైగా షేర్ రాబట్టి ప్రాఫిట్స్ లోకి ఎంటరైంది. మొదటి మూడు రోజులు తెలుగునాట రూ.2 కోట్లకు తగ్గకుండా షేర్ కలెక్ట్ చేసిన ఈ మూవీ.. నాలుగో రోజు ఆదివారం కావడంతో మరో రూ.2 కోట్లకు పైగా షేర్ రాబట్టే అవకాశముంది. ఈ లెక్కన ఫుల్ రన్ లో తెలుగులో భారీ లాభాలను చూసే అవకాశముంది.

2014లో జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులతో పోరాడి వీర మరణం పొందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా 'అమరన్' రూపొందింది. శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి దర్శకుడు. అక్టోబర్ 31న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ మూవీ, పాజిటివ్ టాక్ తెచ్చుకొని, భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్ల గ్రాస్ (రూ.50 కోట్ల షేర్) క్లబ్ లో చేరింది. ఫుల్ రన్ లో 'అమరన్' చిత్రం రూ.200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.