English | Telugu

వందేళ్ల చరిత్రలో రజినీ నే తొలిసారి.. ఇండియా మొత్తం షాక్ 


-రజినీతో సహా ఫ్యాన్స్ షాక్
-ది హిందూస్థాన్ టైమ్స్ చేసిన పనే ఇది
-స్పందించిన రజిని
-నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి!

'రజినీకాంత్'(Rajinikanth)అనే పేరుకి ఉన్న వైబ్రేషన్ యొక్క స్థాయి ఏ పాటిదో తెలిసిందే. సదరు వైబ్రేషన్ యొక్క రేంజ్ మన దేశంలోనే కాదు విదేశాల్లోను చక్కర్లు కొడుతు ఉంటుంది. సూపర్ స్టార్ అనే టాగ్ లైన్ కూడా తనంతట తానుగా వచ్చి రజినీకాంత్ ని చేరిందనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. సదరు పేరుకి అంతటి విస్ఫోటనని కలిగించే శక్తీ ఉంది. ఈ మాటలన్నీ అక్షర సత్యాలని నిరూపిస్తూ రజినీకాంత్ కి అరుదైన గౌరవం దక్కింది.


ఢిల్లీ కేంద్రంగా నడిచే ప్రముఖ భారతీయ ఆంగ్ల పత్రిక 'ది హిందూస్థాన్ టైమ్స్'(The Hindustan times)కి ఉన్న క్యాపబిలిటీ ఎంతో ప్రత్యేకం. ఎక్కువ సర్క్యులేషన్ కలిగిన న్యూస్ పేపర్ కూడా.1924 లో మహాత్మాగాంధీ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. విదేశాల్లో సైతం సదరు ఎడిషన్ కి ఎంతో మంది పాఠకులు ఉన్నారు. అలాంటి ఈ పత్రిక రజినీకాంత్ సినీ ప్రస్థానం యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న తమ ఎడిషన్ మొదటి పేజీ మొత్తాన్ని రజినీ ఫోటోతో ముద్రించింది. హిందూ స్థాన్ టైం ఈ వందేళ్లల్లో ఒక హీరో ఫోటోని మొదటి పేజీ మొత్తం ముద్రించడం ఇదే తొలిసారి.

ఈ విషయం ముందుగారజినీ తో పాటు ఎవరకి తెలియదు.దీంతో సదరు మ్యాగజైన్ పై రజినీ ఫోటో చూసి అందరు షాక్ అయ్యారు. ఈ విషయంపై రజినీ స్పందిస్తు అద్భుతమైన సర్ప్రైజ్ కి కృతజ్ఞతలు. హృదయం ఆనందంతో నిండిపోయింది. నా పై చూపిన ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసాడు. అభిమానులు కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

also read:మోహన్ బాబు పై చిరంజీవి కీలక వ్యాఖ్యలు.. మోహన్ బాబు వల్లే అది సాధ్యమైంది

సినిమాల పరంగా చూసుకుంటే రజినీ ఈ ఏడాది ఆగస్టు లో 'కూలీ' తో వచ్చి మరోసారి తన పెర్ ఫార్మెన్సుతో మెస్మరైజ్ చేసాడు. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని తన స్నేహితుడు అగ్ర హీరో కమల్ హాసన్ నిర్మాణ సారధ్యంలో చేస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ కి వెళ్లనుంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.