English | Telugu

నేను అందరివాడిని: శ్రీకాంత్

హీరో శ్రీకాంత్ తానూ రాజకీయాలకు దూరం అని అంటున్నారు. ఈ మధ్య సినిమా నటులు అందరూ కూడా రాజకీయాల్లోకి వెళ్తున్న విషయం తెలిసిందే. అయితే ఇదే విషయంపై శ్రీకాంత్ మాట్లాడుతూ... నాకు అన్ని రాజకీయ పార్టీల్లోనూ మిత్రులున్నారు. కానీ రాజకీయాలంటే ఏ మాత్రం ఆసక్తి లేదు. ప్రచారం చేయమని కూడా ఎవరు నన్ను అడగరు. ఒకవేళ రాజకీయాల మీద ఆసక్తి ఉంటే చిరంజీవిగారు పార్టీ పెట్టినపుడే వెళ్ళేవాడిని. అయినా నేను అందరివాడిని. ఒక బాధ్యత గల పౌరునిగా ఓటు మాత్రం వేస్తాను అని అన్నారు. పవన్ జనసేన పార్టీ గురించి మాట్లాడుతూ...పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారని తెలియగానే మొదట షాకయ్యాను. ఆయన పార్టీ పెడతారని అస్సలు ఊహించలేదు. ఆయన ప్రసంగం ఆసక్తిగా అనిపించింది అని అన్నారు. రాష్ట్రం రెండుగా విడిపోయినప్పటికి చిత్రపరిశ్రమపై ఎలాంటి ప్రభావం ఉండదు. ప్రజలు తెలుగు సినిమాలను రెండు చోట్ల ఆదరిస్తారు అని తెలిపారు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.