English | Telugu

ఎన్టీఆర్‌కి బిస్కెట్ వేస్తున్నాడు

గ‌బ్బ‌ర్‌సింగ్‌తో హ‌రీష్ శంక‌ర్ ఒక్క‌సారిగా స్టార్ డైరెక్ట‌ర్ అయిపోయాడు. హ‌రీష్ రేంజు చూసి అగ్ర హీరోలంతా హ‌రీష్‌తో సినిమాలు చేయ‌డానికి ఎగ‌బ‌డ్డారు. ముందుగా క‌ర్చీఫ్ వేసింది ఎన్టీఆరే. కనీసం క‌థ కూడా విన‌కుండా రామ‌య్యా వ‌స్తావ‌య్యా సినిమాని ఓకే చేశాడు. అదెంత పెద్ద త‌ప్పో.. ఆ త‌ర‌వాత అర్థ‌మైంది. ఆ సినిమా డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో అటు ఎన్టీఆర్ కెరీర్‌, ఇటు ద‌ర్శ‌కుడిగా హ‌రీష్ శంక‌ర్ కెరీర్ సందిగ్థంలో ప‌డ్దాయి. ఎన్టీఆర్ కోలుకొన్నా... హ‌రీష్ మాత్రం కోలుకోలేక‌పోయాడు. మ‌రో సినిమా మొద‌లెట్ట‌డానికి దాదాపు రెండేళ్ల స‌మ‌యం తీసుకొన్నాడు. ఇప్పుడు సాయిధ‌ర‌మ్‌తేజ్‌తో సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్‌సేల్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు హ‌రీష్‌.

ఈ సినిమా బాగా వ‌స్తున్నట్టు, హ‌రీష్ కెరీర్ ఈ సినిమాతో మ‌రోసారి ఊపందుకోబోతున్న‌ట్టు ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా త‌ర‌వాత హ‌రీష్ మ‌ళ్లీ పెద్ద హీరోల‌కు గాలం వేసే అవ‌కాశాలున్నాయి. అందుకే.. ఇప్ప‌టి నుంచే హ‌రీష్ అందుకు స‌న్నాహాలు చేస్తున్నాడు. ఎన్టీఆర్‌తో మ‌రో సినిమా చేసి లెక్క స‌రిచేయాల‌ని హ‌రీష్ భావిస్తున్నాడ‌ట‌. అందుకే రెగ్యుల‌ర్‌గా ఎన్టీఆర్‌కి ట‌చ్‌లో ఉంటున్నాడ‌ని టాక్‌.

ఎన్టీఆర్ కూడా హ‌రీష్‌తో మ‌రో సినిమా చేయ‌డానికి ఓకే అన్నాడ‌ట‌. అయితే ఈసారి మాత్రం బౌండెడ్ స్ర్కిప్ట్ ఉంటేనే సినిమా ఓకే చేస్తాన‌న్నాడ‌ట‌. దాంతో పాటు సుబ్ర‌హ‌ణ్యం ఫ‌ర్ సేల్ సినిమా అనుకొన్నంత ఆడితేనే అంటూ మ‌రో ష‌ర‌తు విధించాడ‌ట‌. ఈ సినిమానీ దిల్‌రాజునే తెర‌కెక్కించే ఛాన్సులున్నాయి. ఫ్లాప్ ద‌ర్శ‌కుడికి మ‌రోసారి అవ‌కాశం ఇవ్వ‌డానికి ఏ హీరోకైనా గ‌ట్స్ ఉండాలి. ఎన్టీఆర్ అందుకు ధైర్యం చేస్తున్నాడు. ఇప్పుడు నిరూపించుకోవాల్సింది హ‌రీష్ శంక‌రే.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.