English | Telugu

గుణ మ‌ళ్లీ అంత రిస్క్ చేస్తాడా..??

రుద్ర‌మ‌దేవిని భారీగా, త‌న క‌ల‌ల‌కు అనుగుణంగా తెర‌కెక్కించాడేమో గానీ, ఆ సినిమాని అనుకొన్న స‌మ‌యంలో విడుద‌ల చేసే విష‌యంలో మాత్రం చేతులెత్తేశాడు గుణ‌శేఖ‌ర్‌. దాదాపు రూ.60 కోట్ల వ్య‌యంతో గ్రాండ్ లెవిల్లో తీసిన ఈ సినిమా ఎన్నోసార్లు వాయిదా ప‌డింది. ఇప్పుడు సెప్టెంబ‌రు 4న ఈ సినిమాని విడుద‌ల చేయాల‌ని గుణ ఫిక్స‌య్యాడు. సెప్టెంబ‌రు 4 అంటే.. చాలా స‌మ‌యం ఉంది. ఈలోగా ఏమైనా జ‌రగొచ్చు. ఈ సినిమా విడుద‌లైనా, పెట్టుబ‌డి తిరిగి ద‌క్కించుకోవ‌డం కూడా అంత సుల‌భ‌మైన విష‌యం కాదు. ఇంత వ‌ర‌కూ సినీ ప‌రిశ్ర‌మ‌లో సంపాదించిందంతా గుణ ఈ సినిమాకి పెట్టుబ‌డిగా పెట్టేశాడ‌ని టాక్‌. అయితే.. రుద్ర‌మ‌దేవి త‌ర‌వాత గుణ మ‌రో భారీ సినిమా చేయ‌డానికి ఇప్ప‌టి నుంచే స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు ఫిల్మ్‌న‌గ‌ర్‌లో ఓ వార్త వినిపిస్తోంది.

గుణ‌శేఖ‌ర్ త‌న సొంత బ్యాన‌ర్‌లో `ప్ర‌తాప రుద్రుడు` అనే టైటిల్ రిజిస్ట‌ర్ చేయించాడు. ఇది కూడా హిస్టారిక‌ల్ మూవీనే. రుద్ర‌మ‌దేవి తీసేట‌ప్పుడే ప్ర‌తాప రుద్రుడు ఐడియా త‌ట్టింద‌ట గుణ‌శేఖ‌ర్‌కు. ఎలాగైనా ఈ సినిమా చేసి తీరుతా... అనే న‌మ్మ‌కంతో ఉన్నాడ‌ట‌. ఈ సినిమాకీ ఓ స్టార్ హీరో, భారీ బ‌డ్జెట్‌, కోట్లాది రూపాయ‌ల పెట్టుబ‌డి కావాలి. ఆ మాట‌కొస్తే రుద్ర‌మ‌దేవి కంటే పెద్ద రిస్క్‌. అయినా స‌రే.. గుణ‌శేఖ‌ర్ జంక‌డం లేద‌ట‌.

నిజంగా రుద్ర‌మ‌దేవి బాగా ఆడి, పెట్టుబ‌డి తిరిగొస్తే... గుణ మ‌ళ్లీ రిస్క్ చేయ‌డంలో త‌ప్పులేదు. అదే.. లెక్క తేడా చేస్తే మాత్రం గుణ అంత రిస్క్ చేయ‌డ‌మో అంటున్నారు టాలీవుడ్ జ‌నాలు. ఒక‌వేళ చేద్దామ‌నుకొన్నా గుణ‌శేఖ‌ర్‌ని న‌మ్మి స్టార్ హీరో డేట్లు ఇచ్చేది కూడా అనుమాన‌మే. ప్ర‌తాప రుద్రుడు ప్రాజెక్ట్ ఇప్పుడు రుద్ర‌మ‌దేవిపైనే డిపెండ్ అయి ఉంది. రుద్ర‌మ‌దేవి హిట్ట‌యితేనే... ప్ర‌తాప‌రుద్రుడు సెట్స్‌పైకి వెళ్తాడు. అదీ లెక్క‌.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.