English | Telugu

'గోవిందుడు అందరివాడేలే' ఆడియో డేట్

కృష్ణవంశీ, చరణ్ కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం గోవిందుడు అందరివాడేలే. ఈ చిత్రం పాటలను ఆగస్ట్ 20న విడుదల చేయడానికి నిర్మాత ప్లాన్ చేసినట్లు సమాచారం. అలాగే ఈ నెల 28న కృష్ణ వంశీ బర్త్ డే రోజున ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా ముఖ్యభాగం చిత్రీకరణ కూడా పూర్తయింది. ఇప్పటి వరకు మాస్ రోల్స్ చేసిన చరణ్ తొలిసారి కుటుంబ కథా చిత్రం చేస్తుండటంతో బెటర్ ఔట్ పుట్ కోసం కృష్ణవంశీ బాగా కష్టపడుతున్నాడట. నిర్మాత బండ్లగణేష్ కూడా సినిమా కోసం ఖర్చుపెట్టడానికి వెనకాడట్లేదని ఇండస్ట్రీ టాక్.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.