English | Telugu

గోపిచంద్ 'జిల్' ఆడియో రివ్యూ

టాలీవుడ్ హ్యాండ్ సమ్ హీరో గోపిచంద్ 'లౌక్యం' వంటి సూపర్ హిట్ తరువాత నటిస్తున్న చిత్రం 'జిల్'. ఈ రోజు (మార్చి 12న) జిల్ ఆడియో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఆడియో రిలీజ్ కి ఇంకా తక్కువ సమయం వుండడంతో పాటలు ముందుగానే ఆన్ లైన్ లో విడుదలయ్యాయి. 'ర‌న్ రాజా ర‌న్' వంటి సూపర్ హిట్ తరువాత జిబ్రాన్ సంగీతం అందిస్తున్న రెండో సినిమా కావడంతో ఆడియోపై మంచి అంచనాలే వున్నాయి. మరి ఈ ఆడియోలో వున్న పాటలు ఎలా వున్నాయో తెలుసుకుందాం.

గోపిచంద్ 'జిల్' మ్యూజిక్ ఆల్బమ్ లో మొత్తం 5 పాటలున్నాయి. ఈ ఆల్బమ్ 1.'మ్యాన్ ఆన్ ఫైర్' అనే సాంగ్ తో మొదలవుతుంది. ఈ పాటలో ఎక్కువగా హార్డ్ రాక్ మ్యూజిక్ తో సాగుతుంది. ఈ సాంగ్ లో వచ్చే మ్యూజిక్ ఎక్కువగా జేమ్స్ బాండ్ సినిమాలలోని బ్యాంక్ గ్రౌండ్ స్కోర్ ను గుర్తు చేస్తుంది. ఈ పాటను పడిన సింగర్ వాయిస్ కూడా పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది.

2. రెండోది 'జిల్ జిల్ మనసే' అంటూ సాగే రొమాంటిక్ సాంగ్. ఈ పాట చాలా స్లో సాగుతుంది. ఈ పాటకు సింగర్ వాయిస్ చాలా ప్లస్ అయ్యింది. అయితే ఒక్కసారి వింటే ఎక్కే పాట కాదు ఇది.

3. మూడోది 'స్వింగ్ స్వింగ్' అనే పార్టీ సాంగ్. ఈ సాంగ్ లో వుండే యూనిక్ ట్యూన్స్, హిందీ లిరిక్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సాంగ్ యూత్ కి ఎక్కువగా నచ్చుతుంది.

4. నాల్గో పాట 'ఏమైంది ఈ వేళ' ఈ పాటను ఆల్బమ్ లోని బెస్ట్ సాంగ్ గా చెప్పవచ్చు. ఈ సాంగ్ లోని సింగర్ వాయిస్, జిబ్రాన్ కంపోస్ చేసిన మ్యూజిక్ సరికొత్త ఫీలింగ్ ను కలిగిస్తుంది. పాట కూడా చాలా ఫ్రెష్ గా అనిపిస్తోంది.

5. ఐదో పాట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఎందుకంటే టాలీవుడ్ లో ఈ మధ్య వస్తున్న సినిమాలలో ఐటెం సాంగ్ తప్పకుండా వుంటుంది. ఈ పాట ఆ క్యాటగిరికి చెందినదే. 'పోరి మాసాల పోరి' అంటూ సాగే ఈ పాట మాస్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా బి సి సెంటర్ల ప్రేక్షకులు ఈ పాటను బాగా ఎంజాయ్ చేస్తారు. సో మొత్తంగా జిబ్రాన్ 'జిల్' తో మరోసారి తన టాలెంట్ ను చూపించాడు. టాలీవుడ్ లో బెస్ట్ మూజిక్ డైరెక్టరకు పోటినిస్తాన౦టున్నాడు. యు.వి.క్రియోష‌న్స్ మరోసారి స్టైలిష్ ఆల్బమ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.