English | Telugu

నా నుంచి ఇదే చివరి ప్రకటన..పెళ్లయ్యిన వ్యక్తితో డేటింగ్!  

ప్రముఖ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్(Gv Prakashkumar)తన భార్య ప్రముఖ సింగర్ 'సైంధవి'(saindhavi)నుంచి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.వాళ్లిదరు విడాకులు తీసుకోవడానికి జివి ప్రకాష్ ప్రముఖ హీరోయిన్ దివ్యభారతి(Divyabharathi)డేటింగ్ లో ఉండటమే కారణమని పలు కథనాలు వినిపించాయి.దీంతో ప్రకాష్,దివ్య భారతి ఇద్దరు కూడా తమ మధ్య ఫ్రెండ్ షిప్ తప్ప ఏం లేదనే విషయాన్నీ వెల్లడి చేసారు.అయినా సరే ఆ ఇద్దరు రిలేషన్ లో ఉన్నారనే మాటలు వస్తూనే ఉన్నాయి.

రీసెంట్ గా మరోసారి ఈ విషయంపై దివ్య భారతి ఇనిస్టా వేదికగా ఒక పోస్ట్ చేసింది.నాకు సంబంధం లేని వ్యక్తుల కుటుంబ సభ్యుల జీవితాల్లోకి నన్ను లాగొద్దు.నేను ఎవరితోను డేటింగ్ లో లేననే విషయాన్నీ స్పష్టంగా చెప్తున్నాను.పెళ్లి అయిన వ్యక్తితో డేటింగ్ అసలు చెయ్యను.ఆధారాలు లేకుండా నిందలు వెయ్యకండి.కొన్ని రోజుల నుంచి ఈ రూమర్స్ హద్దులు దాటుతున్నాయి.దీని వాళ్ళ నా ప్రతిష్ట దెబ్బతింటుంది.ఇలాంటి రూమర్స్ ని సృషించే బదులు సమాజానికి ఉపయోగ పడే పనులు చేయండి.నా వ్యక్తి గత గోప్యాన్ని గౌరవించండి.ఈ అంశంపై ఇదే నా మొదటి చివరి ప్రకటన అంటు తన పోస్ట్ లో రాసుకొచ్చింది.

2021 లో జివి ప్రకాష్ కుమార్ హీరోగా తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'బ్యాచిలర్' చిత్రం దివ్య భారతి కి సోలో హీరోయిన్ గా మొదటి సినిమా.ఆ సినిమాలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యింది.ఆ తర్వాత గత నెల మార్చి లో కింగ్ స్టన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా,జివిప్రకాష్ కుమార్ నే హీరో.విజయ్ సేతుపతి(VIjay Sethupathi)రీసెంట్ హిట్ 'మహరాజ' లో విజయ్ సేతుపతి వైఫ్ గా కూడా దివ్యభారతి కాసేపు కనపడింది.


రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.