English | Telugu

అంతా వీఎఫ్ఎక్స్ మహిమేనా.. చిరంజీవి లుక్ పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

ఈ సోషల్ మీడియా యుగంలో స్టార్ హీరోలు చాలా జాగ్రత్తగా ఉండాలి. సినిమాలో లుక్ పరంగా ఏ చిన్న తేడా వచ్చినా ట్రోల్స్ ఎదుర్కోక తప్పదు. పోనీ లుక్ బాగుంటే సేఫ్ అని అనుకోడానికి కూడా లేదు. లుక్ బాగున్నా కూడా.. అంతా గ్రాఫిక్సే అనే విమర్శలు ఎదురవుతుంటాయి. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్స్ కొంతకాలంగా ఇటువంటి ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. సినిమాల్లో ఫిట్ గా కనిపించడం కోసం వారు వీఎఫ్ఎక్స్ ని నమ్ముకుంటున్నారని యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుంటారు. ఇప్పుడు చిరంజీవి విషయంలోనూ ఇదే జరుగుతోంది.

చిరంజీవి వయసు 70 ఏళ్ళు. ఇప్పటికీ ఈ తరం హీరోలతో పోటీపడి సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా లుక్ పరంగా అసలు 70 ఏళ్ళు అంటే నమ్మేలా లేకుండా చాలా ఫిట్ గా కనిపిస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన 'మన శంకరవరప్రసాద్ గారు' టైటిల్ గ్లింప్స్ లో అయితే.. చిరంజీవి లుక్స్ అందరినీ సర్ ప్రైజ్ చేశాయి. ఈ వయసులో ఇంత ఫిట్ గా ఉండటం ఎలా సాధ్యమని ఆశ్చర్యపడేలా ఆయన కనిపించారు.

'మన శంకరవరప్రసాద్ గారు'లో చిరంజీవి లుక్ వీఎఫ్ఎక్స్ అని కామెంట్స్ వస్తాయని దర్శకుడు అనిల్ రావిపూడి ముందే ఊహించారేమో. చిరు లుక్ గురించి టైటిల్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి.

"ఈ సినిమాలో లుక్ పరంగా క్రెడిట్ ఇవ్వాలంటే నేను చిరంజీవి గారికే ఇస్తాను. ఆయన లుక్ కోసం మేము వీఎఫ్ఎక్స్ చేసిందేమీ లేదు. 90-95 శాతం ఒరిజినల్. చిరంజీవి గారు బాగా వెయిట్ లాస్ అయ్యి, లుక్ పరంగా ఎంతో కేర్ తీసుకున్నారు. నా అదృష్టం.. నాకు ఆ లుక్ దొరికింది. ఈ క్రెడిట్ చిరంజీవి గారికే దక్కుతుంది. ఉదయం, సాయంత్రం జిమ్ చేసి బాగా కష్టపడుతున్నారు. అందుకే 45-50 ఏళ్ళ వ్యక్తిలా కనిపిస్తున్నారు." అని అనిల్ రావిపూడి అన్నారు.

మరి ఇప్పటికే సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ ని దృష్టిలో పెట్టుకొని రావిపూడి ఈ కామెంట్స్ చేశారా? లేక భవిష్యత్ లో ట్రోల్స్ రాకూడదన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా ఈ కామెంట్స్ చేశారా? అనేది ఆసక్తికరంగా మారింది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం