English | Telugu
రజనీకాంత్‌తో దిల్‌రాజు మూవీ!
Updated : Apr 12, 2023
దిల్‌రాజు ప్లానింగ్ మామూలుగా లేదు. నిన్నమొన్నటిదాకా తెలుగు ఇండస్ట్రీకి పరిమితమైన దిల్‌రాజు ఇప్పుడు ప్యాన్ ఇండియా రేంజ్‌లో పావులు కదుపుతున్నారు. వచ్చీరాని తమిళ్‌లో వారిసు స్టేజ్ మీద తమిళ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేసిన దిల్‌రాజు ఇప్పుడు కంప్లీట్‌గా తమిళ్ నేర్చుకుంటున్నారు. ఆయన నిర్మాణంలో ఓ జబర్దస్త్ మూవీ రాబోతోంది. 50 సినిమాల నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు దిల్‌రాజు. ఇటీవల తమిళ సినిమా వారిసును నిర్మించారు. ఈ సినిమాకు అక్కడ మంచి ఓపెనింగ్స్, కలెక్షన్స్ వచ్చాయి. ఇళయదళపతి విజయ్‌తో హిట్ కొట్టిన దిల్‌రాజు, సీసలైన దళపతి రజనీకాంత్‌తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితమే రజనీకాంత్‌ని కలిసి ఓ సినిమాకు సంతకం చేయించుకున్నారట దిల్‌రాజు. రజనీకాంత్‌కి అడ్వాన్స్ కూడా ఇచ్చేశారట. అయితే ఈ సినిమాను ఎవరు డైరక్ట్ చేస్తారనే విషయం మీద ఇంకా క్లారిటీ లేదు. విజయ్ వారిసు సినిమాకు డైరక్షన్ చేసిన వంశీ పైడిపల్లి రజనీకాంత్ సినిమాను కూడా డైరక్ట్ చేస్తారనేది ఓ న్యూస్. తమిళ్, తెలుగుతోపాటు ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాను నిర్మిస్తారని టాక్.
ప్రస్తుతం దిల్‌రాజు ప్రొడక్షన్‌లో గేమ్ చేంజర్ సినిమా తెరకెక్కుతోంది. ఇండియన్ సినిమా ఏస్ డైరక్టర్ శంకర్‌తో ఈ సినిమా చేస్తున్నారు దిల్‌రాజు. రామ్‌చరణ్ హీరోగా రూపొందుతోంది. కియారా అద్వానీ నాయిక. 60 శాతం షూటింగ్ పూర్తయింది. శంకర్ ప్రస్తుతం కమల్‌హాసన్ సినిమా ఇండియన్2తో బిజీగా ఉన్నారు. అందుకే గేమ్ చేంజర్‌కి షెడ్యూల్ గ్యాప్ ఇచ్చారు.
ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ సినిమాలో నటిస్తున్నారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రంలో మోహన్‌లాల్ స్పెషల్ రోల్ చేస్తున్నారు. కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి శివరాజ్‌కుమార్ నటిస్తున్నారు. తమిళ హీరో శివకార్తికేయన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.