English | Telugu

జపాన్ లో దేవర సూపర్ డూపర్ హిట్..ఇక రికార్డుల లెక్కలే మిగిలింది 

మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)లాస్ట్ ఇయర్ 'దేవర'(Devara)పార్ట్ 1తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఎన్టీఆర్ కెరీర్ లోనే మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు,డ్యూయల్ రోల్ లో ఎన్టీఆర్ ప్రదర్శించిన పెర్ఫార్మెన్స్ కి అభిమానులతో పాటు ప్రేక్షకులు జేజేలు పలికారు.దర్శకుడు కొరటాల శివ(Koratala Siva)పార్ట్ 2 స్క్రిప్ట్ ని కూడా పూర్తి చేసి ఎన్టీఆర్ పిలుపు కోసం వెయిట్ చేస్తున్నాడు.అభిమానులు కూడా పార్ట్ 2 అప్ డేట్ కోసం రీగర్ గా వెయిట్ చేస్తుండగా,త్వరలోనే పార్ట్ 2 కి సంబంధించిన న్యూస్ బయటకి వచ్చే అవకాశం ఉంది.

ఇక దేవర జపాన్ లో మార్చి 28 న జపాన్(Japan)లాంగ్వేజ్ లోనే విడుదల కానున్న విషయం తెలిసిందే.రీసెంట్ గా అక్కడ దేవర ప్రత్యేక ప్రివ్యూ స్క్రీనింగ్ జరిగింది.ప్రివ్యూ స్క్రీనింగ్ అంటే మూవీ రిలీజ్ చేయడానికి ముందు,ప్రేక్షకుల స్పందనను అంచనా వేయడానికి 'షో' వెయ్యడం జరుగుతుంది.ఈ స్క్రీనింగ్‌కి వివిధ వర్గాల ప్రజలను ఆహ్వానించి,ప్రశ్నాపత్రాలు లేదా ఇతర మార్గాల ద్వారా వారి అభిప్రాయాలని తెలుసుకుంటారు.దీంతో చిత్రబృందం తమ సినిమాని మెరుగుపరచడానికి, మార్పులు చేయడానికి అవసరమైన అభిప్రాయాలను సేకరిస్తుంది.కానీ దేవర ప్రైవేట్ ప్రివ్యూ స్క్రీనింగ్‌లో బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.మూవీ చూసిన జపాన్ సినీ ప్రేమికులు జపాన్ భాషలో సోషల్ మీడియా వేదికగా ట్వీట్ లు చేస్తున్నారు.ఇప్పుడు వాటి తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీంతో వరల్డ్ వైడ్ గా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు దేవరకి జపాన్ లో లభిస్తున్న స్పందన పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.


ఎన్టీఆర్ కూడా దేవర ప్రమోషన్స్ కోసం ఈ నెల 22 న జపాన్ వెళ్లనున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దేవర కి సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో మూవీకి సంబంధించిన పలు విషయాలని జపాన్ లోని తన ఫ్యాన్స్ తో పంచుకోబోతున్నట్టుగా తెలుస్తుంది.దీంతో అక్కడి అభిమానులు ఎన్టీఆర్ రాక కోసం ఎదురుచూస్తుండటంతో పాటు ఎన్టీఆర్ ఏం మాట్లాడతాడనే ఆసక్తి కూడా వాళ్ళల్లో మొదలయ్యింది. ఆర్ఆర్ఆర్(rrr)మూవీతో ఎన్టీఆర్ జపాన్ లో తనకంటు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే.ఎన్టీఆర్ ప్రస్తుతం హిందీలో హృతిక్(Hrithik Roshan)తో కలిసి వార్ 2(War 2)చేస్తున్నాడు.ఆగస్టు 14 న మూవీ విడుదల కానుంది.దేవర తర్వాత ఎన్టీఆర్ నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోయే మూవీ ఇదే.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.