English | Telugu

ప్రముఖ బిజినెస్ మాన్ పై దీపికా పదుకునే ఘాటు ట్వీట్..అసలు నిజం చెప్పిందా! 

బాలీవుడ్ భామ దీపికా పదుకునే(Deepika padukone)కి భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది.షారుఖ్ ఖాన్(Sharukh Khan)హీరోగా 2007 లో విడుదలైన 'ఓం శాంతి ఓం' తో ప్రారంభమయిన ఆమె సినీ ప్రస్థానం దాదాపుగా రెండు దశాబ్దాల నుంచి అప్రహాతీతంగా కొనసాగుతుంది. బాలీవుడ్ లో ఉన్న అందరి అగ్ర హీరోల సరసన నటించిన దీపికా గత సంవత్సరం జూన్ లో ప్రభాస్ తో కలిసి కల్కి 2898 ఏడి లో నటించి మంచి విజయాన్ని అందుకుంది.

ఇక రీసెంట్ గా ఎల్ అండ్ టీ కంపెనీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణియన్(sn subrahmanyan)తన సంస్థలో పనిచేసే ఉద్యోగులపై కొన్ని విమర్శలు చేసిన విషయం తెలిసిందే.ఇప్పుడు వాటిపై సోషల్ మీడియా వేదికగా దీపికా స్పందిస్తు 'ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి అలాంటి ప్రకటన చేయడం చాలా షాక్ గా ఉంది #mentalhealthmatters అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించింది.సుబ్రమణియన్ కి మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమని దీపికా చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

సుబ్రమణియన్ తన దగ్గర పని చేసే ఉద్యోగుల గురించి మాట్లాడుతు వారానికి 90 గంటలు పని చెయ్యడంతో పాటు ఆదివారాల్లోను ఆఫీస్‌ కు రావాలి.ఎప్పుడూ ఇంట్లో ఉంటూ ఏం చేస్తారు,ఎంతసేపు భార్య ముఖం చూస్తు ఉంటారంటు వెటకారంగా మాట్లాడాడు. ఆయన తీరుపై నెటిజన్లు కూడా విరుచుకు పడుతున్నారు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.