English | Telugu

ఆ ప్లాస్టిక్ మొహం ఎవ‌రిద‌బ్బా..?

బెబ్బులి పులి మ‌ళ్లీ గాండ్రించింది. అస‌లు ఆయ‌న గాండ్రించ‌డం కోస‌మే.. అలా చిన్నా, చిత‌కా ఫంక్ష‌న్ల‌కూ హాజరైపోతుంటార‌ని ఇండ్ర‌స్ట్రీలో జ‌నాలు చెవులూ, ముక్కులు కొరుక్కొంటుంటారు. పెద్దాయ‌న‌ పాత మేట‌రే చెప్పినా యాడింగ్ మాత్రం కూర‌లో కొత్తిమీర‌లా అదిరిపోయింది. అంద‌రి ఫోక‌స్సూ ఆ `ప్లాస్టిక్ మొహం` మీదే ప‌డింది. ఆ హీరో మెగా ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన‌వాళ్లేన‌ట‌.. అంటూ గుస‌గుస‌లాడుకొంటూ, జోకులేసుకొంటూ, న‌వ్వితే ఎక్క‌డ బ‌య‌ట‌ప‌డిపోతామో అంటూ లోలోప‌ల ఆనందించేవాళ్లు బోలెడుమందున్నారు. మ‌రోవైపు అయిన దానికీ కానిదానికీ ఇలా వీర లెవిల్లో రెచ్చిపోవ‌డం ఏం బాలేదంటూ స‌ణుక్కొనేవాళ్లూ ఉన్నారు. కానీ ఆ పెద్దాయ‌న ముందు చెప్పే ధైర్యం ఎవ‌రిది? అందుకే లౌక్యంగా లోలోప‌లే కుమిలిపోతున్నారు. లౌక్యం అంటే గుర్తొచ్చింది.. తాజాగా లౌక్యం సినిమా హిట్ట‌యిన ఆయ‌న భారీ స్టేట్‌మెంట్ ఇచ్చారు.

అస‌లింత‌కీ ఆయ‌న చెప్పాల‌నుకొన్న‌ది లౌక్యం హిట్ట‌ని కాదు, ఆ త‌ర‌వాత వ‌చ్చిన ఓ భారీ సినిమా (గోవిందుడ‌ని డౌటు) ఫ్లాప‌ని ఘ‌ట్టిగా చెప్పాల‌నుకొన్నారంతే! అస‌లింత‌కీ ఈమ‌ధ్య కాలంలో థియేట‌ర్ల స‌మ‌స్య ఎక్క‌డుంది చెప్పండి? కావ‌ల్సిన‌న్ని ఉన్నాయి.. లేనిద‌ల్లా మంచి సినిమానే. ఎన్ని థియేట‌ర్లు కావాలో చెప్పండి, మేమిస్తాం - అంటూ ఆ న‌లుగురిలో ఒకాయ‌న నెత్తీ నోరూ కొట్టుకొంటున్నాడు. ఆ మాట‌లు విన్లేదేమో...?? ఇప్పుడు లౌక్యానికీ కావ‌ల్సిన‌న్ని థియేట‌ర్లున్నాయి. అదీ బాగానే ఆడేస్తోంది.. సినిమాలేక‌పోవ‌డం వ‌ల్ల‌. ఎప్పుడూ చెప్పిందే చెప్పి, ఆ న‌లుగురిపైనో, లేదంటే వార‌స‌త్వ హీరోల‌పైనో అర‌వ‌డం, ఆ త‌ర‌వాత కామైపోవ‌డం ఏంటో..?

చెప్పిందే చెప్ప‌డం వ‌ల్ల ఆయ‌న‌కు, విన్న‌దే విన‌డం వ‌ల్ల మ‌న‌కూ విసుగురావ‌డం త‌ప్ప మ‌రో లాభం లేదాయో. ప్లాస్టిక్ మెహాలు వెలుగుతూనే ఉన్నాయి. చెక్కీ చెక్కీ నగిషీలు దిద్దుకొన్న మొహాలు...స్టార్ల‌వుతూనే ఉన్నారు. ఓపికుంటే స్టార్ల‌ను పుట్టించాలి. ద‌మ్మున్న సినిమాల్ని చ‌క‌చ‌క తీసి పారేస్తుండాలి. ఆ ద‌మ్ము ఈ పెద్దాయ‌న‌కు కావ‌ల్సినంత ఉంది. త్వ‌ర‌లోనే ఆయ‌న్నుంచి ఓ సినిమా రాబోతోంది. ఆ సినిమాకు ఇలాంటి ఇక్క‌ట్లు ఎదురు కాకూడ‌ద‌ని.. థియేట‌ర్లు దొర‌క‌ని ప‌రిస్థితి రాకూడ‌ద‌ని కోరుకొందాం. ఫినిషింగ్ టచ్ ఏంటంటే.. ఆ ప్లాస్టిక్ మొహాం మీకేమైనా తెలిస్తే చెప్పండి. భుజాలు త‌డుముకొనేవాళ్లు ఎక్కువైపోయారు.!!

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.