English | Telugu
నాని రేర్ ఫీట్.. నైజాంలో 25 కోట్ల షేర్!
Updated : Apr 13, 2023
నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ 'దసరా' రెండు వారాల్లో వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.62 కోట్ల షేర్ రాబట్టి ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా నైజాం(తెలంగాణ)లో ఈ చిత్రం అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. దీంతో నాని రేర్ ఫీట్ సాధించాడు.
మార్చి 30న విడుదలైన దసరా మొదటిరోజు నుంచే నైజాంలో జోరు చూపించింది. దీంతో రెండు వారాల్లోనే నైజాంలో ఏకంగా రూ.25 కోట్ల షేర్ రాబట్టింది. టైర్-2 హీరోలలో ఈ ఫీట్ సాధించిన మొదటి హీరో నాని కావడం విశేషం. యంగ్ హీరోలలో 'గీత గోవిందం'తో విజయ్ దేవరకొండ, 'ఎఫ్-2'తో వరుణ్ తేజ్ నైజాంలో రూ.20 కోట్ల షేర్ క్లబ్ లో చేరగా.. ఇప్పుడు దసరాతో నాని ఏకంగా 25 కోట్ల మార్క్ ని అందుకున్నాడు.
ఇక దసరా వసూళ్ల వేట దాదాపు ముగిసినట్టే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రూ.30-40 లక్షల రేంజ్ లో షేర్ రాబడుతున్న దసరా.. ఈ వారం శాకుంతలం, రుద్రుడు, విడుదల-1 వంటి సినిమాల రాకతో మెజారిటీ థియేటర్లు కోల్పోయి.. కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అయ్యే అవకాశముంది. దీంతో ఈ చిత్రం ఫుల్ రన్ లో వరల్డ్ వైడ్ గా రూ.63 కోట్ల లోపు షేర్ కి పరిమితం కానుంది.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.