English | Telugu

ప్రముఖ సినీ సింగర్ చిత్రకు పుత్రికా వియోగం

ప్రముఖ సినీ సింగర్ చిత్రకు పుత్రికా వియోగం జరిగింది. వివరాల్లోకి వెళితే తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో కొన్ని వేల పాటలు పాడిన ప్రముఖ సినీ ప్లే బ్యాక్ సింగర్ చిత్ర దుబాయ్ కి ఒక సంగీత విభావరి నిమిత్తం వెళ్ళారు. ఈ సంగీత విభావరిని ప్రముఖ సంగీత దర్శకులు ఎ.ఆర్.రెహమాన్ నిర్వహిస్తున్నారు. దుబాయ్ కి తన తల్లి సింగర్ చిత్రతో పాటు అక్కడికి ఆమె ఏకైక కుమార్తె నందిని కూడా వెళ్ళారు.


ప్రస్తుతం స్కూళ్ళకు వేసవి శలవలు కావటంతో చిత్ర కూడా తన కుమార్తెను తనతో పాటు దుబాయ్ కి తీసుకెళ్ళారు. అక్కడ స్విమ్మింగ్ పూల్లో ఏప్రెల్ 14 వ తేదీ, గురువారం నాడు ఈత కొట్టటం కోసం వెళ్ళిన సింగర్ చిత్ర ఏకైక కుమార్తె ఎనిమిదేళ్ళ నందిని ప్రమాదవశాత్తూ మరణించారు. అత్యంత ప్రేమగా పెంచుకునే తన ఏకైక కుమార్తె నందిని మరణించటంతో సింగర్ చిత్ర కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారట. సింగర్ చిత్రకు తెలుగువన్ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.