English | Telugu
చిరంజీవికి చికెన్ గున్యా.. ఒకేరోజు గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్!
Updated : Sep 22, 2024
గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకొని, మెగాస్టార్ చిరంజీవి అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో మెగా అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే ఈ సంతోష సమయంలోనే వారికొక చేదు వార్త. అదేంటంటే చిరంజీవి కొద్దిరోజులుగా చికెన్ గున్యాతో బాధపడుతున్నారు. (Megastar Chiranjeevi)
హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ వేదికగా చిరంజీవికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రధాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హోస్ట్ మాట్లాడుతూ.. చిరంజీవి 25 రోజులుగా చికెన్ గున్యాతో బాధపడుతున్నారని, అయినప్పటికీ ఈ వేడుకకు హాజరయ్యారని, అది ఆయనకున్న డెడికేషన్ అని తెలిపింది.
అయితే చికెన్ గున్యా నుంచి చిరంజీవి పూర్తిగా కోలుకుంటున్నారని, అభిమానులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి.