English | Telugu

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బిగ్ షాక్.. లాస్ట్ మినిట్ లో దేవర ఈవెంట్ క్యాన్సిల్!

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఊహించని షాక్ తగిలింది. వారు ఎంతగానో ఎదురుచూస్తున్న 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇప్పుడు స్టార్ట్ కావాల్సి ఉండగా.. అనుకోకుండా చివరి నిమిషంలో క్యాన్సిల్ అయినట్లు న్యూస్ వినిపిస్తోంది. (Devara Pre Release Event)

దేవర ఈవెంట్ ని మొదట ఓపెన్ గ్రౌండ్ లో భారీగా చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ ఓ వైపు వర్షాలు, మరోవైపు అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తే కంట్రోల్ చేయడం ఇబ్బంది అవుతుందన్న కారణాలతో.. హైదరాబాద్ లోని నోవొటెల్ లో చేయాలని నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశారు. అయితే ఆ ఆడిటోరియం కెపాసిటీకి మించి కొన్ని రెట్లు ఎక్కువ అభిమానుల వచ్చారు. దీంతో అటు పోలీసులకు, నోవొటెల్ సిబ్బందికి వారిని కంట్రోల్ చేయడం తలకుమించిన భారం అయిపోయింది. బయటనే వేల సంఖ్యలో అభిమానులు ఆగిపోగా.. లోపల కూడా ఎన్టీఆర్ మరియు గెస్ట్ లు కూర్చునే చోటు వరకు అభిమానులతో నిండిపోయింది. దీంతో ఈవెంట్ ని రద్దు చేయాలని నిర్ణయించారని ప్రచారం జరుగుతోంది. పోలీసు వారు, నోవొటెల్ సిబ్బంది ఇదే విషయాన్ని చెబుతున్నారు. అయితే ఈ ఈవెంట్ ని నిర్వహిస్తున్న శ్రేయాస్ మీడియా మాత్రం.. కాసేపట్లో అంతా సద్దుమణుగుతుందని, ఈవెంట్ ని నిర్వహిస్తామని చెబుతోంది. మరి కాసేపట్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.